Sunday 3 January 2016

ఉండవల్లి తిక్కకు లెక్క లేదా ?

undavelli

లాజిక్కులు మాట్లాడటంతో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఎవరూ సాటిరారనే చెప్పాలి. అయితే ఆయన లాజిక్కులు మాటలు ఎవరికీ పెద్దగా ఉపయోగపడవని రాజకీయవర్గాలు అంటుంటాయి. ప్రజాసమస్యలపై పోరాడాల్సిన సమయంలో పనికిరాని విషయాలను పట్టుకుని వేలాడటం ఆయనకు బాగా అలవాటుగా మారిపోయింది. ఆ మధ్య పట్టిసీమ దండగ ప్రాజెక్ట్ అని, చంద్రబాబుకు మతి చలించిందనే అనుమానం కలుగుతోందని లేనిపోని ఆరోపణలు చేసిన రాజమండ్రి మాజీ ఎంపీ… తాజాగా ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం లోక్ సభలో ఆమోదం పొందలేదని సరికొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు.. 2014 ఫిబ్రవరి 18న లోక్‌సభలో ఆమోదం పొందిందా? అనే పేరుతో పుస్తకాన్ని ప్రచురించానని… దీనిని రాష్ట్రపతికి కూడా అందించానని చెప్పిన ఉండవల్లి… విభజన చట్టం ఆమోదం సమయంలో జరిగిన తప్పులను పార్లమెంటే సరిదిద్దాలని అన్నారు. ఇదంతా ఎలా ఉన్నా… జరగని విషయంపై ఉండవల్లి అనవసర రాద్ధాంతం ఎందుకు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. కొందరైతే ఉండవల్లికి తిక్కుందని… కానీ దానికి అసలు లెక్కే లేదని చర్చించుకుంటున్నారు. కాసేపు చంద్రబాబుపై విమర్శలు చేసే ఉండవల్లి, కాంగ్రెస్, బీజేపీలను కూడా టార్గెట్ చేస్తుండటంతో.. ఆయన జగన్ పార్టీ వైపు అడుగులు వేసేందుకు ఇలాంటివి చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి ఇలాంటి నాయకుడి వైసీపీలో చేరితే… ఆ పార్టీకి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.
please share it..

No comments:

Post a Comment