కాపు గర్జన కాస్త తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రజలు ప్రాణాలు తీసుకునేవరకు
ఈ ఉద్యమం వెళుతోంది. కాపు గర్జన తొలి రోజున జరిగిన హింస చల్లారక ముందే కాపులకు న్యాయం జరగటం లేదన్న ఆవేదనతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం సృష్టిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ లో 53 ఏళ్ల చిక్కాల వెంకట రమణమూర్తి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం ఉద్రిక్తతకు దారి తీసింది. కలెక్టరేట్‌లో ఉన్న టీవీ డిష్ యాంటెన్నాకు ఉరి వేసుకున్న అతన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో అతని జేబులో ఉన్న సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ సూసైడ్ నోట్‌లో రమణమూర్తి కాపుల్ని బీసీల్లోకి చేర్చాలని.. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తారని తాను భావించానని.. అలాంటిది తమకు పవన్ నుంచి న్యాయం జరగలేదన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రశ్నించే పార్టీ అని పవన్ చెప్పారని.. కానీ ప్రశ్నల్లేని పార్టీగా మిగిలిందని.. కాపు గర్జనతో అయినా న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కులం గురించి పట్టిచుకోని పవన్‌ను కులం కోసం పోరాడాలని నమ్మకం పెట్టుకోవడం…అది నిజం కాలేదని రమణమూర్తి ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. వెంకటరమణ కాకినాడ డెయిరీ ఫాం సెంటర్ డీజిల్ మెకానిక్‌గా భావిస్తున్నారు.
No comments:
Post a Comment