Tuesday, 2 February 2016

మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసిన రామ్ చరణ్

4017810450210

మెగాహీరో రామ్ చరణ్ తేజ్ మళ్ళీ గేమ్ స్టార్ట్ చేశాడని అంటున్నారు. గతంలో కొత్త దర్శకులకి, యువ దర్శకులకి అవకాశం ఇద్దాం అనే ఆలోచనలతో తన మూవీల కథలను సెలక్ట్ చేసుకున్నాడు. ఇప్పడు తను నటిస్తున్న వరుస చిత్రాలు బాక్సాపీస్ వద్ద యావరేజ్ టాక్ తో సరిపెట్టుకోవటంలో కొత్త సక్సెస్ ఫార్ములాని స్టార్ట్ చేస్తున్నాడు. అందుకే టాప్ కమర్షియల్ డైరెక్టర్స్ తో జోడీ కట్టేందుకు సిద్ధం అయ్యాడు. ‘మిర్చి’ సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన కొరటాల శివ తో రామ్ చరణ్ జోడీ కట్టేందుకు సిద్ధం అయ్యాడు. కొరటాల శివ తన రెండో సినిమా ‘ శ్రీమంతుడు’తో టాప్ డైరెక్టర్ గా మారాడు. కొరటాల శివ ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ‘జనతా గ్యారేజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ విధంగా మంచి సక్సెస్ లతో ఉన్న కొరటాల శివతో తన మూవీని ప్లాన్ చేసుకుంటే మంచిదని రామ్ చరణ్ అభిప్రాయ పడుతున్నాడంట. ఇందుకు తనే కొరటాల శివతో డైరెక్ట్ గా అడగుకుండా, తన టీంతో తన ప్రపోజల్ ని చేరవేస్తున్నాడని అంటున్నారు. మొత్తంగా రామ్ చరణ్, కొరటాల శివతో గేమ్ స్టార్ట్ చేశాడని అంటున్నారు. అయితే కొరటాల శివ టీం నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం, జూనియర్ మూవీ తరువాత కొరటాల నాగార్జునతో ఓ మూవీని చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

No comments:

Post a Comment