ప్రస్తుతం వరుస సక్సెస్ లతో ఉన్న హీరో నాని. భలే భలే మగాడివోయ్, తాజాగా వచ్చిన క్రుష్ణ వీర ప్రేమ గాధ వంటి చిత్రాలు నానిని బాక్సాపీస్ వద్ద బలంగా చేశాయి. ముఖ్యంగా నాని చిత్రాలు వందకి వంద శాతం లాభాలు ఖాయం అని నిర్మాతలు అంటున్నారు. అలా నిర్మాతల హీరోగా నానికి భారీ డిమాండ్ పలుకుతుంది. ఇటువంటి సందర్భంలో నాని స్వయంగా తనే నిర్మాణ సంస్థని స్థాపించి చిన్న సినిమాలను తెరకెక్కించాలని చూస్తున్నాడు. ఆ విధంగా ఇప్పటికే ఓ పథకాన్ని రచించాడు. అయితే ఇందులో తను హీరో కాకుండా, వేరే చిన్న హీరోలతో సినిమా తీయాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం మార్కెట్ లో సక్సెస్ లో ఉన్న హీరోలలో నాని, రాజ్ తరుణ్ మాత్రమే. ఇటువంటి సందర్భంలో నానినే తను నిర్మిస్తున్న మూవీలకి హీరోగా మారితే మంచిదని అంటున్నారు. అలా కాకుండా తను నిర్మాతగా, వేరే వాళ్ళు హీరోలుగా నిర్మిస్తే…తనుకు మిగిలలేది అప్పులే అని అంటున్నారు. ఈ సలహాను నానికి అందరూ ఇస్తున్నారు. సలహాలు పాటించకుండా నాని సొంత నిర్ణయం తీసుకొని మూవీలను నిర్మిస్తే మాత్రం నష్టాలు తప్పవని అంటున్నారు. ప్రస్తుతం నాని హీరోగా పలు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఓ వైపు తను హీరోగా చేస్తూనే మరోవైపు తను నిర్మిస్తున్న మూవీలను రిలీజ్ చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.
No comments:
Post a Comment