సినిమా.. ఇదో రంగుల ప్రపంచం.. ఎన్నో ఆశలతో ఈ రంగురంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టాలని
కలలుకంటారు. ముఖ్యంగా మోడలింగ్ రంగంలో ఉన్న యువతులు సినిమాల్లో అడుగు పెట్టాలనుకుంటారు.. `ఒక్క చాన్సు` అంటూ ఇండస్ట్రీలో తెలిసిన వారిని అడుగుతుంటారు.అయితే సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు చాలా విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా పరిశ్రమకు వచ్చిన కొత్తలో అయితే లైంగిక వేధింపులు ఉంటాయనే ప్రచారం ఉంది. ఏదైనా బ్యాగ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలో నెగ్గుకు రావచ్చు.. కానీ, కొత్తమ్మాయిలు మాత్రం అవస్థలు, వేధింపులు ఎదుర్కోవాల్సిందే. అవకాశాలిస్తామని నమ్మబలికి తమ అవకాశం తీర్చుకునే వారుంటారు. ముంబైలో ఒక మోడల్ ఇలానే మోసపోయిందట.
బాలీవుడ్ లో కొంతమంది నిర్మాతలను కలిసి, సినిమా అవకాశాలు అడుగుతోందట ఓ మోడల్. సురేష్ మెహతా అనే నిర్మాతను కూడా కలిసిందట. అతను అవకాశం ఇస్తానని నమ్మబలికాడట. మాట్లాడదాం రమ్మంటూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కి ఆహ్వానించాడట. ఆ మోడల్ కూడా ఎంతో ఆశతో ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లిందని సమాచారం. హోటల్ గదిలో ఆమెపై అత్యాచారం చేయబోయాడని సమాచారం. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. సురేష్ మమెహతా పై కేసు నమోదు చేసి, సంఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించే పని మీద పోలీసులు ఉన్నారట. సురేష్ మెహతా పరారీలో ఉన్నాడని భోగట్టా. ఇండస్ట్రీలోకి వచ్చే యువతులకు ఇటువంటివన్నీ ఎన్నో జరిగినా.. అన్నీ రంగుల ప్రపంచంలో కలిసిపోతాయి..
No comments:
Post a Comment