ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అందులోనూ సామాజిక మాధ్యమాలు వినియోగించి
యువతులను మోసగిస్తున్న వారి సంఖ్య అధికమవుతూనే ఉంది. ఫ్రెండ్ రిక్వెస్ట్‌లతో మొదలైన ఈ మోసం.. నెమ్మదిగా మాటలతో మొదలై.. తరువాత వారికి మాయమాటలు చెప్పి.. వారిని ముగ్గులోని దింపుతారు.. తరువాత యువతుల అశ్లీల చిత్రాలు పంపించాలని కోరతారు.. ఆపై వారిని బ్లాక్‌మెయిల్ చేస్తారు.. డబ్బులు కావాలని వేధిస్తారు.. ఇవ్వకపోతే ఆ చిత్రాలు పోర్న్ వెబ్‌సైట్లలో పెడతామని బెదిరిస్తారు.. ఈ వేధింపులు తట్టుకోలేని యువతులు కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇలా అమ్మాయిలను మోసం చేస్తున్న కర్నూలుకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్‌ని కర్నూలు పోలీసులు అరెస్టుచేశారు.
ఆయనో ఆర్ఎంపీ డాక్టర్.. ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడే.. అమ్మాయిల ప్రాణాలతో చెలగాటమాడాడు.. యువతులను ఆకర్షించేందుకు అందమైన ఫ్రొఫైల్ పిక్ పెట్టాడు. నీటుగా సూటూ, బూటూ వేసుకున్నాడు.. మెడలో టై కట్టాడు.. నెత్తి మీద జుట్టు లేదని గ్రహించి.. అది కవర్ చేయడానికి పైన టోపీ పెట్టాడు.. ఇకనే బాలీవుడ్ హీరోలా మారిపోయాడు.. ఇక అదే చిత్రాన్ని ప్రొఫైల్ పిక్‌గా పెట్టేశాడు.. ఇక అమ్మాయిలెవరైనా లైక్ కొడితే చాలు.. వారితో చాటింగ్ మొదలుపెడతాడు.. నెమ్మదిగా వారితో మాటలు కలుపుతాడు.. ముగ్గులోకి దించుతాడు.. తరువాత వారిని కలుసుకోవాలని చెప్పి.. రూమ్‌కు పిలుస్తాడు.. వారి అశ్లీల చిత్రాలు తీసి.. తరువాత వారిని బెదిరింపులకు గురిచేస్తాడు. డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తాడు.. ఇలా ఒత్తిడిని ఎదుర్కొన్నఅమ్మాయిలు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడిపై నిఘా ఉంచి చాకచక్యంగా పోలీసులు ఆ కామాంధుడిని అరెస్టుచేశారు.
No comments:
Post a Comment