Tuesday, 2 February 2016

తూ.గో పోలీసుల గోడు పట్టించుకోరా?

098056030

స‌మాజంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌ను ప‌రిర‌క్షించేవారు పోలీసులు.. ప్ర‌భుత్వ ఆస్తులు ధ్వంసం కాకుండా.. లా అండ్ ఆర్డ‌ర్‌ని నిరంత‌రం ప‌రిర‌క్షించేవారు పోలీసులు.. ఎక్క‌డైనా దాడులు జ‌రిగితే వెంట‌నే ప‌రిస్థితుల‌ను అదుపులోకి తెచ్చేవారు పోలీసులు.. ఆందోళ‌నలు జ‌రిగిన స‌మ‌యంలో వారికీ దెబ్బ‌లు త‌గులుతాయి. కానీ వాటినెవ‌రూ ప‌ట్టించుకోరు.. అయితే కాపు గ‌ర్జ‌న స‌భ త‌ర్వాత జ‌రిగిన విధ్వంసంలో ఆందోళ‌న కారులు.. తుని పోలీస్‌స్టేష‌న్‌ను ముట్ట‌డించారు. అక్క‌డ ఉన్న పోలీసుల‌పై దాడుల‌కు తెగ‌బడ్డారు. ఆందోళ‌న కారుల‌పై పోలీసులు దెబ్బ వేయ‌లేదు అయినా ఆందోళ‌న‌కారులు రెచ్చిపోయారు. ఇందులో 14 మంది కానిస్టేబుళ్లు గాయ ప‌డ్డారు. ఇద్ద‌రి ప‌రిస్థితి తీవ్రంగా ఉంది. మ‌రి ఇప్పుడు వీరికి బాధ్యులెవ‌రు? వారి గోడు పట్టించుకునేవారెవ‌రు ?
“మేమేం చేశామని దాడులు చేశారు సార్‌! కనీసం ఎవరిపైనా దెబ్బ వేయలేదు. మద్యం మత్తులో ఉన్న స్థానికేతరులు రౌడీ మూకల్లా స్టేషన్‌పై దాడికి దిగితే.. నిస్సహాయుల్లా ఉండలేక, ఆయుధాలు పట్టలేక దెబ్బలు తినాల్సి వచ్చింది’’ అని ‘తూర్పు’ పోలీసులు ఉన్నతాధికారుల వద్ద వాపోయారు. తుని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌పై, పోలీసుల‌పై ఆందోళనకారులు దాడులు చేశారు. అక్కడి ఘటన మొత్తాన్ని ఇంటెలిజెన్స్ పోలీసులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు.
వాటిని పరిశీలించేందుకు అడిషనల్‌ డీజీ ఆర్పీ ఠాకూర్‌, ఐజీ కుమార విశ్వజీత, డీఐజీ హరికుమార్‌ తుని పోలీస్‌ స్టేషనకు వెళ్లారు. ఊహించని విధంగా స్థానిక పోలీసుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ‘మేమేం చేశామని దాడులు చేశార’ని పోలీసులు ప్రశ్నించారు. అయితే సంయమనం పాటించడం వల్ల డిపార్ట్‌మెంట్‌ గౌరవం పెరిగిందని, ఎవరెవరు దాడులకు తెగబడ్డారో వారందరినీ గుర్తించి కేసులు నమోదు అరెస్టు చేద్దామని వారికి ఉన్నతాధికారులు చెప్పినట్లు సమాచారం. స‌మాజాన్ని ర‌క్షించే వారిపైనే ఇలా దాడులు జ‌రిగితే ఎలా అని కొంద‌రు ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు.

No comments:

Post a Comment