కాపు గర్జనలో జరిగిన విధ్వంసంపై అన్ని వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్న
సంగతి తెలిసిందే! అయితే ఈ వ్యవహారంలో అసాంఘిక వ్యక్తులు కాపు గర్జనలో ప్రవేశించి.. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టారు. తుని రైల్వేస్టేషన్‌కు నిప్పు పెట్టారు.. పోలీసులపై దాడులకు తెగబడ్డారు.. ఈ దాడుల్లో వైకాపా హస్తం ఉందని మొదటి నుంచీ అధికార పార్టీ విమర్శిస్తోంది. ఇప్పుడు ఈ నినాదాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పుడు టీడీపీ నేత ముద్దు కృష్ణమనాయుడు వైకాపా అధినేత జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కాపు గర్జన సభ రోజున కడప నుంచి రౌడీలను పంపి విధ్వంసం సృష్టించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ, అధికార ప్రతినిధి ముద్దు కృష్ణమనాయుడు మాట్లాడుతూ.. తూర్పుగోదావరి ప్రజలు శాంతికాముకులని, విపక్ష నేత జగన్ తన మనుషులు బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డిలను పంపించి, కడప నుంచి రౌడీలను దించి విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. అద్దె గూండాలతో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలును కాల్చి, రోడ్డును దిగ్బంధించారని విమర్శించారు. పోలవరం, రాజధాని నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తుంటే, జగన్ పట్టిసీమ, రాజధానికి అడ్డుపడుతూ అబివృద్ధికి ఆటంకాలు కల్పిస్తున్నాడని తీవ్రంగా ఆయన ఆరోపించారు.
No comments:
Post a Comment