భార్యతో ఏదో ఒక విషయంపై గొడవపడి క్షణికావేశంలో భార్యలను చంపే భర్తలను చూస్తూనే ఉంటాం. కటకటాల
పాలయిన సంఘటనలు అనేకం. అయితే ఇన్సూరెన్స్‌ల కోసం భార్యలను చంపే మగాడు కూడా ఉన్నాడు. మీరు తెలుసుకుంటారా.. అయితే వివరాలలోకి వెళితే.. . కొలరాడోలోని ఓ హరోల్డ్ హెంత్రాన్ అనే వ్యక్తి అందుకు భిన్నంగా ఇన్సూరెన్సుల కోసం ప్రతీ 12 ఏళ్లకో భార్య కావాలనుకున్నాడు. అందుకోసం మొదటి భార్య లియాన్‌ను 1995వ సంవత్సరంలో సరిగ్గా 12వ పెళ్లిరోజున డిన్నర్ కోసమని బయటకు తీసుకెళ్లాడు. ఆమెను కొండపైనుంచి తోసేసి చంపేశాడు.పోలీసులకు ఎటువంటి అనుమానము రాలేదు. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో ఓ డేటింగ్ వెబ్‌సైట్ ద్వారా పరిచయం అయిన టోనీని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప కూడా ఉంది. 2012వ సంవత్సరంలో టోనీని కూడా సరిగ్గా 12వ పెళ్లిరోజున లాంగ్ ట్రిప్‌కు వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు. ఓ ఎత్తైన కొండపైకి తీసుకెళ్లి ఆమెతో చివరి సెల్ఫీ తీసుకున్నాడు. ఆమెను కారులో కూర్చోమని చెప్పి బయట ఫోన్ మాట్లాడుతున్నట్లు నటించి కారును 130 అడుగుల ఎత్తైన కొండపై నుంచి లోయలోకి తోసేశాడు.
అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తన భార్య ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయిందనీ ఆమెను రక్షించేందుకు ప్రత్యేక బృందాన్ని తీసుకురావాల్సిందిగా కోరాడు. ఓ హెలీకాఫ్టర్‌ను కూడా తీసుకురమ్మని ఖర్చు తానే భరిస్తానని పోలీసులకు హామీ ఇచ్చాడు. పోలీసులు ఎంతగా శ్రమించినా ఆమెను కాపాడలేకపోయారు. అయితే పోలీసుల విచారణలో హరోల్డ్ మొదటి భార్య కూడా కొండపై నుంచే పడి చనిపోయిందని తెలుసుకున్నారు. అతడిపై నిఘాను పెంచారు. వారి దర్యాప్తులో టోని వేలికి ఉండే 20 వేల డాలర్ల డైమండ్ రింగ్ మిస్ అయిందని తెలుసుకున్నారు. దీంతో హరోల్డ్‌పై పోలీసులకు అనుమానం మరింత పెరింగింది. స్పాట్‌లో దొరికిన కెమెరాను చెక్‌చేస్తే ఆమెతో చివరగా తీసిన సెల్ఫీలు కనిపించాయి. అవి తీసిన సమయం కంటే పోలీసులకు హరోల్డ్ ఫోన్ చేసిన సమయం ముందుగా ఉండటంతో పోలీసులు అతడిని కటకటాల్లోకి నెట్టారు. ఇప్పటికీ తాను వారిద్దరినీ చంపలేదనీ, ప్రమాదవశాత్తూనే వారు చనిపోయారని హరోల్డ్ తన వాదనను జడ్జీల ముందు వినిపిస్తున్నాడు.
No comments:
Post a Comment