కొత్త కస్టమర్ల కోసం బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ ప్రవేశపెట్టింది. ఈ సదర్భంగా మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపచినట్టు బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకంలో భాగంగా కొత్త సిమ్ కొనుగోలు చేసిన కస్టమర్లు రెండు నెలల పాటు 80 శాతం వరకు తక్కువ రేట్లకే కాల్స్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఫర్ మినిట్, ఫర్ సెకన్ బిల్లింగ్ కాల్ రేట్లను సవరించారు. కొత్త కనెక్షన్ తీసుకున్నవారు ఫర్ సెకన్ ప్లాన్ కోసం రూ. 36. ఫర్ మినిట్ ప్లాన్ కోసం రూ. 37 లతో రీచార్జ్ చేసుకోవలసి ఉంటుందన్నారు.
రూ. 37ల స్కీమ్‌ను ఎంచుకున్న వారు నిమిషానికి పది పైసల చార్జీతో స్థానిక, ఎస్‌టీడీ (బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్) కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేస్తే నిమిషానికి 30 పైసలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రూ. 36 ల స్కీమ్ ఎంచుకున్నవారు ప్రతి మూడు సెకన్లకు 2 పైసల చార్జీ ఉంటుంది. ఎంఎన్‌పీ ద్వారా బీఎస్ఎన్ఎల్ కు మారిన కస్టమర్లకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన తెలిపారు.
please share it..
No comments:
Post a Comment