అడుసు తొక్కనేల కాలు కడుగ నేల అన్న చందంగా ఉంది రోజా సెల్వమణి పరిస్థితి.నిన్నమొన్నటి శీతాకాల సమావేశాల్లో భాగంగాం తిట్ల పురాణం అందుకుని ఏడాది పాటు సస్పెన్షన్ కు గురైన ఆమెకు ఇంకా కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయ్. చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందకపోగా ఇప్పటికీ ఇప్పటికీ ఆమె తానే రైటని చెప్పుకుంటూ తిరుగుతుండడం ఈ వ్యవహారంలో కొసమెరుపు. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆమెపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ వేదిక గా తనను తీవ్ర మానసిక క్షోభ గురిచేసినందుకు గాను ఆమె ఈ చర్యకు సిద్ధమవుతున్నారు. నాడు రోజా విచక్షణ కోల్పోయి తనను అనరాని మాటలు అన్నందుకు ప్రతిగా కోటి రూపాయలకు పరువు నష్టం దావా వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రోజాకు నోటీసులు పంపారామె! మరోవైపు రోజా వ్యవహారంపై సొంత పార్టీ నుంచి కూడా ఆమెకు మద్దతు కరువవుతోంది. జగన్ మొదలుకొని మిగిలిన నేతలంతా రోజా మితిమీరిన ప్రవర్తనపై పెద్దగా స్పందించడం లేదు సరికదా అలా అని మద్దతు సైతం పలకడం లేదు. దీంతో రోజా పరిస్థితి రసకందాయంలో పడింది. మొత్తమ్మీద రోజా ఆ రోజు వినిపించిన తిట్ల పురాణం తాలుకా సీడీలు ఇప్పుడు కోర్టు వారి దృష్టికి వెళ్లనున్నాయన్నమాట! అంతేకాదు స్పీకర్ ను కూడా రోజాపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు అనితా మీడియాకు తెలిపారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు కోర్టు బోనులో పడింది. ఇక ఫలితం ఎలా ఉండనుందో..! ఏదేమైనా ఆ మధ్య ఆర్థిక పరిస్థితి అనుకూలించక నానా అవస్థలు పడ్డ రోజాకు తాజాగా కొత్త తిప్పలు మొదలయ్యాయి. ఇవి అటు తిరిగి ఇటు తిరిగి ఆమె గారి రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తాయేమో! లేకా ఈ దుందుడుకుతనమే ఆమె గారికి కొత్త చరిష్మాను కట్టబెడుతుందేమో! ఏమో! ఏ నిమిషానికి ఏమి జరుగునో..!
Thursday, 28 January 2016
నీ పాపం పండెను నేడు : కోర్టు బోనులో రోజా

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment