ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో మరింత ఫోకస్ కావాటానికి యంగ్ డైరెక్టర్ ఓంకార్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. రాజుగారిగది మూవీతో ఓంకార్ కి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఇక తన వద్ద ఓ రెండు, మూడు కథల వరకూ పెద్ద హీరోలకి సంబంధించిన స్టోరీలు ఉన్నాయి. ఎప్పటికైనా పెద్దహీరోలతో సినిమాలను తీయాలని ఓంకార్ టార్గెట్ ని ఫిక్స్ చేసుకున్నాడు. ఇక తన ప్రతి మూవీకి తన రేంజ్ ని, తన మూవీలోని స్టార్స్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. తాజాగా రాజుగారిగది సీక్వెల్ కి అన్నీ సిద్ధం అవుతున్నాడు. అంజలి హీరోయిన్ గా ఇందులో నటిస్తుందని అంటున్నారు. అలాగే ఓ పాత్ర కోసం రెజీనా కసాండ్రని ఓంకార్ సంప్రదించాడంట. ప్రస్తుతం రెజీనా టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. తనని హీరోయిన్ గా తీసుకునేందుకు పలువురు యంగ్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఓంకార్, రెజీనాని పది నిముషాల పాత్ర కోసం సంప్రదించగా అందుకు..రెజీనా 80 లక్షలను డిమాండ్ చేసిందట. ప్రస్తుత పరిస్థితుల్లో రెజీనా ఓ ఫుల్ లెన్త్ మూవీకి కోటి నుండి కోటిన్నర తీసుకుంటుంది. కానీ ఓంకార్ మూవీలో కేవలం పది నిముషాల పాత్ర కోసం 80 లక్షల డిమాండ్ చేయటంతో ఓంకార్ బిత్తరపోయాడంట. అయితే ఓంకార్ మూవీలో నటించేందుకు తనకి ఇష్టం లేకపోవడంతో..ఇలా ఓంకార్ ని బెధరగొట్టిందని అంటున్నారు.
please share it..
No comments:
Post a Comment