Sunday, 27 December 2015

మళ్ళి అదే రోజు వస్తానంటున్న పవన్

మళ్ళి అదే రోజు వస్తానంటున్న పవన్




పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , పవర్ ఫేం బాబీ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. ఈ మధ్యే గుజరాత్ లోని వదోదర లో భారీ షూటింగ్ షెడ్యుల్ ని పూర్తి చేసుకొని వచ్చిన చిత్ర బృందం త్వరలోనే హైదరాబాద్ లో మరో భారీ షెడ్యుల్ లో పాల్గొననుంది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రం గురించి ఎటువంటి విషయాలను తెలియజేయని చిత్ర బృందం సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం విడుదల తేది ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మూడేళ్ళ క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ చిత్రం విడుదలై సంచలనాలు క్రియేట్ చేసిన రోజు మే 11న సర్దార్ గబ్బర్ సింగ్ ను విడుదల చేయనున్నారట. దీంతో గబ్బర్ సింగ్ లాగే ఈ చిత్రం కుడా సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయం అని నమ్ముతున్నారు  చిత్ర బృందం.

No comments:

Post a Comment