“నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ ” ఇదీ గబ్బర్ సింగ్ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్. ఈ మాటల మాయాజాలం గానీ మహేంద్ర జాలం గానీ ఎలా ఉన్నా రానున్న వేసవిలో మాత్రం పవన్ – మహేశ్ మధ్య పోటీ తప్పేట్టు లేదు.ఎందుకంటే.. కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే బ్రహోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు విడుదల కానున్నాయ్ గనుక.దీంతో ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అగ్ర హీరోలుగా కొనసాగుతున్న ఈ హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైతే నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉండటంతో ముందుగానే మహేశ్ రంగంలోకి దిగి సర్దార్ చిత్ర నిర్మాతలతో మాట్లాడాడట! బ్రహ్మోత్సవం చిత్రం విడుదలకి ముందుగానీ లేదా తర్వాత గాని కొద్ది రోజుల గ్యాప్ తీసుకుని సర్దార్ సినిమాను విడుదల చేయాలని కోరాడట! మరి! దీనిపై పవన్ ఏ విధంగా స్పందిస్తాడో మరి!ఇప్పటికే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా కోసం ‘శ్రీమంతుడు’ సినిమాను వాయిదా వేసుకున్న మహేశ్ సినీ పరిశ్రమ సంక్షేమార్థం ఇటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అభినందనీయమ్.
please share it..
No comments:
Post a Comment