మద్యం అమ్మకాలలో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ సరికొత్త ట్రెండ్‌కు తెరలేచింది. ఇప్పటి వరకు మద్యం షాపుల్లో ఎవరైనా మహిళలు మందు కొనేందుకు వెళితే అక్కడున్న పురుషులు వారిని పై నుంచి కిందకు తేరిపారా చూస్తుంటారు. అంటే పురుషుల దృష్టిలో మహిళలు మద్యం షాపుకు వెళ్లినా అదేదో వింతన్న మాట. అయితే ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మందేయాలన్న కోరిక ఉన్న మగువలందరూ సిగ్గు పడాల్సిన పనిలేదు. వాళ్ల కోసం ప్రత్యేక మద్యం షాపు కౌంటర్లు వస్తున్నాయి.
ఢిల్లీలో ఓ మద్యం వ్యాపారి తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ఓ కొత్త ట్రెండ్‌కు తెరలేపాడు. తన మద్యం షాపుల్లో మహిళల కోసం ప్రత్యేక మద్యం కౌంటర్లు ఏర్పాటు చేశాడు. మగువలు కూడా త్రీ ఛీర్స్ చెప్పుకునేలా ఢిల్లీలో వారికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి మద్యం అమ్మకాల్లో కొత్త ట్రెండ్‌కు తెరలేపాడు. పబ్బుల్లో, క్లబ్బుల్లో మందేసి చిందేసే అమ్మాయిలకు ఈ నయా బిజినెస్ వారి పాలిట వరంలా మారింది. వారు ఎలాంటి సిగ్గు, బిడియం లేకుండా తమ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్లలోకి వెళ్లి మద్యం కొనుక్కుని తాగేమొచ్చు. వీరికి ప్రత్యేకంగా రూమ్‌లు ఉంటాయి. వీరు మద్యం కొనుక్కుని ఆ స్పెషల్ రూమ్స్‌లో మహిళల మధ్యలో ఎంజాయ్ చేస్తూ మందేయొచ్చు.
ఢిల్లీలో స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా మెట్రో నగరాలకు కూడా విస్తరించే అవకాశం ఉంది. మద్యం వ్యాపారంలో ఉత్తర అమెరికా, యూరప్ దేశాల తర్వాత ఇండియా కూడా టాప్ ప్లేసులో ఉంది. దీనికి తోడు ఇటీవల నిర్వహిస్తున్న పలు సర్వేలలో అమ్మాయిలు సిగరెట్లతో పాటు మద్యం సేవించే మహిళల సంఖ్య పెరుగుతోంది. మగాళ్లతో సమానంగా అవకాశాల కోసం, పదవుల కోసం వెంపర్లాడడమే కాదు తాగి తూగడంలో కూడా మీకు మీరే సాటి అననిపించుకోవచ్చు. అయితే ఇది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్నది మాత్రం కాలమే నిర్ణయించాలి.
please share it..
No comments:
Post a Comment