బెంగుళూరులో మరో దారుణం జరిగింది. ఢిల్లీలో నిర్భయ ఘటన తరహాలో మరొకటి చోటుచేసుకుంది. కాల్‌సెంటర్‌లో పనిచేసే ఓ యువతిని తమ మాయమాటలతో నమ్మించి కారులో ఎక్కించుకుని నగరంలో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు కామాంధులు. అపస్మారక స్థితికి చేరుకున్నాక ఆమెను ఓ ఆలయ సమీపాన పడేసి పరారయ్యారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల బాధితురాలి సొంతూరు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్. హాస్టల్ నుంచి శనివారం రాత్రి తొమ్మిదిన్నర సమయంలో దొమ్మలూరులో కాల్ సెంటర్‌కి వెళ్లేందుకు బస్టాప్‌కి వచ్చింది. కొద్దిసేపటికి బస్టాప్‌కి కాల్ సెంటర్ ఉద్యోగులను తరలించే వాహనమొకటి అక్కడికి వచ్చింది.కారు డ్రైవర్ యువతిని పలకరించి దొమ్మలూరులోని కాల్ సెంటర్‌కి వెళ్తున్నట్లు నమ్మబలికాడు.ఆమె వాహనంలోకి ఎక్కాక, అందులో మరో ఇద్దరు యువకులు కనిపించడంతో అనుమానం వచ్చి ఆమె అప్రమత్తం అయ్యేలోపే… కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. బెంగుళూరు వీధుల్లో చక్కర్లు కొడుతూ వాహనంలోనే ఆమెపై అత్యాచారానికి దిగారు. దాదాపు రెండుగంటలపాటు ఆమెకు నరకం చూపించారు. చివరకు బాధితురాలు అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో దొమ్మలూరులోని అయ్యప్ప ఆలయ సమీపాన కిందకు తోసి వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో కొందరు ఆటోవాలాలు ఆమెను చూసి ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా వాహనాన్ని, దుండగులను గుర్తించే పనిలో ఉన్నట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు.
please share it..
No comments:
Post a Comment