Wednesday, 30 December 2015

ఫేస్ బుక్ కి భారత్ లో బ్రేకులు!

social-media-india-222

సోష‌ల్ మీడియాకు కేంద్రం చెక్ చెప్ప‌నుందా? విద్వేషపూరిత వ్యాఖ్యలను క‌ట్ట‌డి చేయ‌నుందా? అంటే ఔన‌నే! అంటున్నాయ్ ప‌రిణామాలు. ఇటీవ‌ల అసాధార‌ణ ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. త‌గాదాలు హెచ్చుమీర‌కుండా ఉండేందుకు జమ్మూకాశ్మీర్‌లో ఇంటర్‌నెట్‌ను బ్యాన్ చేయాల్సి వ‌చ్చింది.ఉత్తరప్రదేశ్‌లో దాద్రీఘటన తర్వాత కూడా సోషల్ మీడియా సాక్షిగా అసత్యాలు, అవాస్తవాలు ప్రచారంలోకి వచ్చాయి.అంతెందుకు 2013 నాటి ముజఫర్‌నగర్ ఘర్షణలకు కూడా ఓ రకంగా ఇలాంటి సామాజిక మాధ్యమాలే కారణం.సమాచార మార్పిడికి విప్లవాత్మకమైన వేదికను అందించిన సోషల్ మీడియాను కొన్ని అరాచక శక్తులు దుర్వినియోగం చేయడం మొదలు పెట్టాయ్.దీంతో వీటికి చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో సహా వివిధ సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న అభ్యంతరక అంశాలను తొలగించేందుకు ఓ పాలసీని రూపొందించే పనిలో ఉంది కేంద్రం. దీనికోసం త్వరలోనే కీలక సమావేశాన్ని నిర్వహించబో తోంది. దీనికి ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రతినిధులు కూడా.. హాజరవుతున్నారు. కేంద్ర హోంశాఖ, టెలికమ్యూనికేషన్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల సమన్వయంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.భావ ప్రకటనాస్వేచ్ఛను కాపాడుతూనే…విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలను ఎలా నియంత్రించాలన్న దానిపై ఈ భేటీలో చర్చించనున్నారు. హద్దూ అదుపులేకుండా సాగే విపరీతమైన విష ప్రచారాలకు ఆపడమే లక్ష్యంగా ఈ పాలసీ సిద్ధం కానుంది.చూడాలిక! దీనిపై ఇండియాలో ఏ త‌ర‌హా చ‌ర్చ జ‌ర‌గ‌నుంది.
please share it..

No comments:

Post a Comment