ఫ్యాన్స్ పై ఫైర్ అయిన మహేష్
మహేష్ బాబుకు కోపం
వచ్చింది అంతే కాస్త ఘాటుగానే తన ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యాడట ! ఈ సంఘటన ఊటీ లో జరిగింది . అయితే మహేష్ బాబు కి కోపం రావడానికి కూడా కారణం ఉందండీ ! అసలు విషయం ఏమిటంటే ఊటీ లో మహేష్ బ్రహ్మోత్సవం షూటింగ్ జరుగుతోంది ,దాంతో అక్కడికి కొంతమంది మహేష్ ఫ్యాన్స్ అంటూ మన తెలుగువాళ్ళు వెళ్లారట షూటింగ్ గ్యాప్ లో మహేష్ తో ఫోటోలు దిగాలని కోరారు దానికి మహేష్ కూడా ఓకే అన్నాడు కానీ వాళ్ళ దగ్గర కెమెరా లేకపోవడంతో కొంత సమయం వృధా అయ్యింది దాంతో షూటింగ్ స్పాట్ లో ఉన్న కెమెరా మెన్ ని పిలిపించి వాళ్లతో ఫోటోలు దిగి వాళ్ళకు క్లాస్ పీకాడట ! ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముంది అంటూ .
No comments:
Post a Comment