Tuesday, 29 December 2015

కాల్ మనీ-సెక్స్ రాకెట్: మత్తు మందు ఇచ్చి ఏడుగురు రేప్ చేశారు

కాల్ మనీ-సెక్స్ రాకెట్: మత్తు మందు ఇచ్చి ఏడుగురు రేప్ చేశారు

విజయవాడ: కాల్ మనీ కేసులో ఎన్నో దురాఘతాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఓ యువతి కాల్ మనీకి చెందిన ఏడుగురు నిందితులు తన పైన అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఏడుగురు నిందితులు తనకు కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారం చేశారని వాంగ్మూలం ఇచ్చింది. ఈమె ఆరు నెలల క్రితం పోలీసులకు ఈ విషయమై ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది. తాజాగా, ఆమె న్యాయస్థానంలో వాంగ్మూలం కూడా ఇచ్చింది. కాల్ మనీ నిందితుల అరాచకాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. ఏడుగురు నిందితుల పైన నిర్బయతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఇప్పటి వరకు కాల్ మనీ కింద 780 కేసులు నమోదయ్యాయి. పరారీలో 51 మంది కాల్ మనీ వ్యాపారస్తులు ఉన్నారు. నలుగురు సెక్స్ రాకెట్ నిందితులు పరారీలో ఉన్నారు. పలువురు కాల్ మనీ నిందితులు కోర్టు ఎదుట లొంగిపోతారని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉండగా, ముగ్గురు కాల్ మనీ నిందితులను టాస్క్ ఫోర్స్ బృందం రెండు రోజులుగా విచారిస్తోంది. సెక్స్ రాకెట్ కేసులో ఉన్న నిందితుల కాల్ డేటాను విశ్లేషించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. వాటిలో పెద్ద సంఖ్యలో మహిళల ఫోన్ నెంబర్లను గుర్తించారు. గంటల తరబడి ఆ మహిళలతో నిందితులు మాట్లాడినట్లుగా నిర్ధారించారు. ఏ 4 నిందితుడు సత్యానందం పరారు కావడానికి సహకరించిన వారి పైన పోలీసులు దృష్టి పెట్టారు. పలువురి పాత్రపై ఆరా తీస్తున్నారు. నిందితుడు సత్యానందానికి మద్దతుగా ఓ ఎన్నారై ప్రముఖుడు జోక్యం చేసుకున్నట్లుగా భావిస్తున్నారు.
please share it..

No comments:

Post a Comment