బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్ లను తిరగరాయటమే కాదు... అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ మరో అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు. సౌత్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, ఇళయదళపతి విజయ్ లాంటి టాప్ స్టార్లు మాత్రమే వాడుతున్న ప్రెస్టీజియస్ రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకొని టాప్ ప్లేస్ లో నిలిచాడు. టాలీవుడ్ లో చాలా మంది హీరో ఖరీదైన లగ్జరియస్ కార్లను వాడుతున్నారు. అయితే వారందరినీ మించి ఏకంగా 8 కోట్లు ఖర్చు పెట్టి రోల్స్ రాయిస్ ఫాంతమ్ కారును తెప్పించుకున్నాడు ప్రభాస్.
ఇటీవలే ఈ కారు డెలివరీ కావటంతో తన సన్నిహితులకు భారీ పార్టీ ఇచ్చాడు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న బాహుబలి పార్ట్ 2 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను 2016 డిసెంబర్ కల్లా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. బాహుబలి తొలి భాగం ఘన విజయం సాధించటంతో సీక్వల్ పై భారీ అంచనాలే ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
please share it...
No comments:
Post a Comment