Friday 5 February 2016

కాపుల రిజర్వేషన్ల కోసం పవన్ పోరాటం ?

dfgdfgdfg

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలనే నినాదంతో పోరాటం చేయబోతున్నారా ? బీజేపీ ఎమ్మెల్సీ, పవన్ కు సన్నిహితుడిగా పేరున్న సోము వీర్రాజు మాటలను బట్టి అవుననే అనిపిస్తోంది. కాపులకు రిజర్వేషన్ల ఇచ్చే అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడినట్టు సోము వీర్రాజు తెలిపారు. అంతేకాదు ఎన్నికలకు ముందు కాపుల సంక్షేమానికి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తామన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని… లేని పక్షంలో ఆ సామాజికవర్గమంతా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. ఇటీవలకాలంలో సోము వీర్రాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ… ఈ సారి ఆయన పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకురావడం మాత్రం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. స్వతహాగా కాపు కులానికి చెందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్… తనకు కులాల పట్టింపు లేదని… తాను కాపునాయకుడిగానే మిగిలిపోవాలని భావించడం లేదని పలుసార్లు బాహాటంగానే చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తారా అనే విషయం చర్చనీయాంశంగా మారుతోంది. ఒకవేళ అదే జరిగితే… ఎంతోమందికి ఆరాధ్య నటుడిగా ఉన్న పవన్… కాపు నాయకుడిగానే మిగిలిపోవాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి… తనకు సన్నిహితుడైన సోము వీర్రాజు వ్యాఖ్యలపై పవర్ స్టార్ స్పందిస్తాడా లేక సైలెంట్ గా ఉంటాడా అన్నది చూడాలి.

No comments:

Post a Comment