Friday, 5 February 2016

ప‌వ‌న్ ఫ్లెక్సీలు చించేస్తున్న కాపులు

4801450120878

ప్ర‌పంచ‌వ్యాప్తంగా కులాల‌కు, మ‌తాల‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎవరైనా ఒకరు ఏదైనా
రంగంలో పైకొస్తే.. ఆ కులానికి చెందిన వారంతా సదరు వ్యక్తిని తమ వ్యక్తిగా ఓన్ చేసుకోవటం కనిపిస్తుంది. ప్రాంతీయంగా కూడా కొందరి విషయంలో ఇలా జరుగుతుంది. ఇక రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్ర‌ముఖ సినీ హీరో, జ‌న‌సేన అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌న్ తాను ఏ వ‌ర్గానికి చెంద‌ని వాడిన‌ని చెపుతున్నా కాపులు మాత్రం ప‌వ‌న్‌ను త‌మ వ‌ర్గానికి చెందిన‌వాడిగా భావిస్తుండ‌డం స‌హ‌జం.
అయితే తాజాగా కాపు గ‌ర్జ‌న సంద‌ర్భంగా జ‌రిగిన హింస‌తో పాటు కాపు రిజ‌ర్వేష‌న్ల కోసం జ‌రుగుతున్న ఉద్య‌మానికి మ‌ద్ద‌తుగా ప‌వ‌న్ నిలుస్తాడ‌ని ఆశించిన ప‌వ‌న్ తనకు కులాలు పట్టవని.. కాకుంటే కాపుల విషయంలో కొన్ని దశాబ్దాలుగా అన్యాయం జరిగిందన్న మాటను చెప్పుకొచ్చారు. అయితే.. ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలే తప్పించి.. హింస పనికి రాదని హితవు పలికారు. తమకు అన్యాయం జరిగిందన్న ఆక్రోశంలో ఉన్న పలువురు కాపులకు పవన్ మాటలు అస్సలు నచ్చలేదు.
కాజు గ‌ర్జ‌న‌, కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప‌వ‌న్ త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చి, త‌మ త‌ర‌పున గ‌ట్టిగా గ‌ళం వినిపిస్తాడ‌నుకుంటే ఇలా మాట్లాడ‌డం వాళ్ల‌కు రుచించ‌లేదు. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఆయన ఫ్లెక్సల్ని చించివేస్తూ.. పవన్ పై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపల్లె మండలం ఉప్పూడి.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.. నర్సాపురం ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీల్సి చింపేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం గమనార్హం. ప‌వ‌న్‌ నాలుగు మాటలు చెప్పేసి సినిమా షూటింగ్ కు వెళ్లటం పట్ల కొందరు కాపు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కాపు గ‌ర్జ‌న‌, రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప‌వ‌న్ త‌న సొంత సామాజిక‌వ‌ర్గం వారి మంట‌ల్లో చిక్కుకున్న‌ట్టే స్ప‌ష్ట‌మ‌వుతోంది.

No comments:

Post a Comment