
సంచలన తార అడ్డంగా బుక్ అయిపోయారు. ఇంతకు నయతార ఎక్కడ బుక్ అయ్యిందా అని
సందేహిస్తున్నారా…ఆమె ఎక్కడో కాదు మలేషియా ఎయిర్‌పోర్టులో నకిలీ వీసాతో అక్కడ అధికారులకు దొరికిపోయారట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో జోరుగా హల్‌చల్ చేస్తోంది. మలేషియా విమానాశ్రయంలో నయనతారను అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేసింది వాస్తవమే అని సమాచారం. నయన ప్రస్తుతం విక్రమ్ సరసన ఇరుముగన్ చిత్రంతో నటిస్తున్నారు.
మలేషియాలో జరుగుతున్న ఆ చిత్ర షూటింగ్‌లో పాల్గొని ఇండియాకు తిరుగు ముఖం పట్టిన నయనతార మలేషియా విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కేఎల్1, కేఎల్2 అనే రెండు రకాల టెర్మినల్ విధాలను అమలు పరుస్తున్నారు. ఇండియాకు వచ్చే ప్రయాణికులు కేఎల్1 టెర్మినల్ ద్వారా ప్రవేశించాల్సి ఉండగా కేఎల్2 టెర్మినల్ వద్ద ఉన్న ఇమ్మిగ్రేషన్ అధికారులు వీసా తనిఖీ చేసి సరిగా లేవంటూ చిన్న కలకలానికి కారణం అయ్యారు. అయితే వారికి నటి నయనతార క్లారిఫికేషన్ ఇచ్చి ఇండియాకు చేరుకున్నారని ఇరుముగన్ చిత్ర యూనిట్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే మరో సమాచారం ప్రకారం మలేషియా ఎయిర్‌పోర్టు అధికారులు నయన వీసాపై పలు ప్రశ్నలు వేసి ఆమెను అక్కడే 20 గంటల పాటు ఉంచేశారని టాక్. దీంతో నయన అక్కడ భారత రాయబారి కార్యాలయాన్ని ఆశ్రయించి ఇక్కడకు వచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి.
No comments:
Post a Comment