Wednesday 10 February 2016

గాసిప్స్ ని తట్టుకోలేక ఓపెన్ అయింది

tt008484501

ఫిల్మ్ ఇండస్ట్రీలోని స్టార్స్ పై గాసిప్స్ ఎక్కువుగా వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో హీరోయిన్స్ పై లేని పోని వార్తలు వస్తున్నారు. వారు చేస్తున్న మూవీల సంఖ్యను ఎక్కువుగా చెప్పటం, ఇతర కాంబినేషన్స్ తో ముడిపెట్టడం వంటివి ఎక్కువుగా జరుగుతున్నాయి. దీని కారణంగా చాలా మంది ఇండస్ట్రీకి సంబంధించిన వారే ఆ హీరోయిన్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇటువంటి వార్తలకు బ్రేక్ చెప్పటానికి స్వీటీ లిప్స్ తాప్సీ బయటకు వచ్చింది. కొంత కాలంగా తన మూవీపై లేనిపోని వార్తలు వస్తున్నాయంట. ఇతర స్టార్ కాస్టింగ్ తో తను వరుస మూవీలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. కొంత మంది అయితే తాప్సీకి మూవీలు లేవని చెబుతున్నారంట. ఇవన్నీ గాసిప్స్ కావటంతో తాప్పీ నిజాలను బయటకు చెప్పుకువచ్చింది. పంజాబీ ముద్దుగుమ్మ అయిన తాప్సీ, ప్రస్తుతం కొన్ని సినిమాల్లోనే నటిస్తుంది. మిస్టర్ పర్ఫెక్ట్ తో ప్రభాస్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది తాప్సీ. ఆ తరువాత తెలుగులో ఎక్కువ మూవీలలో నటించలేకపోయింది. బాలీవుడ్ పై దృష్టి పెట్టి “చష్మె బద్దూర్” తో పాటు పలు చిత్రాలలో నటించింది. ఇక తాజా చిత్రాలను చూస్తే, సందీప్ కిషన్ సరసన ఓ సినిమా, యష్ చోప్రా బ్యానర్ లో ఓ సినిమా చేస్తుంది. ఈ రెండు సినిమాలు తప్పితే తను ఎటువంటి చిత్రాలలో నటించటం లేదని చెప్పుకొచ్చింది. ఇలా చెప్పటానికి కారణం తనపై వస్తున్న పుకార్లే అని అంటుంది.

No comments:

Post a Comment