Monday 8 February 2016

పవన్ కళ్యాన్ స్పీచ్ పై వర్మ మండిపాటు

89205909560230.20

కాపు రిజర్వేషన్ల విషయమై జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరుపై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీవ్రస్థాయిలో
మండిప‌డ్డారు.  తాజాగా కాపు గ‌ర్జ‌న‌పై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ట్విట్ట‌ర్ ఆయధంగా ప‌వన్‌పై విరుచుకుప‌డ్డారు.  అసలు తనిచ్చిన స్పీచ్ తనకైనా అర్థమైందా అని అనుమానంగా ఉందన్నారు.  పవన్ ప్రెస్‌మీట్ పెట్టడానికి వస్తున్నప్పుడు, కారులో తన పక్కన ఉన్నవాళ్ల చెప్పుడు మాటలతో ప్రభావితమై ఆ స్పీచ్ ఇచ్చారని అన్నారు. ”కమ్మల మనస్తత్వం ఉన్న కాపుల కన్నా.. స్వచ్ఛమైన కమ్మల మనసున్న కాపులు బహు మేలు.. విశ్వదాభి రామ వినుర వేమ” అని కూడా వ్యాఖ్యానించారు.
   ఏపీ పౌరుడిగా పవన్ కళ్యాణ్‌కు ఓ విజ్ఞప్తి అంటూ.. ఒక్కసారి జనసేన పార్టీ స్థాపించిన సందర్భంగా మీరిచ్చిన స్పీచ్ మీకు మీరే చూసుకుని మీరే నేర్చుకోండి అంటూ విమర్శలు సంధించారు. అదే సమయంలో.. పీకే అభిమానిగా తాను వ్యక్తపరిచిన నిజాల్ని వ్యతిరేకించే ఏ పీకే ఫ్యాన్ అయినా తన దృష్టిలో నమ్మక ద్రోహి అన్నారు. పవన్ తన జనసేన లాంచింగ్ స్పీచ్‌ని రిపీట్ మోడ్‌లో చూసి, తన అన్నయ్య కంటే దారుణంగా స్క్రూయింగ్ చేసేముందు దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పారు. పవన్ అభిమానులందరికీ ఒక విజ్ఞప్తి అని.. తాను చెప్పేదాంట్లో ఎంత నిజాయ‌తీ ఉందో మీ అందరికీ మనసులో నిజం తెలుసు కాబట్టి.. ఆయనకు వాళ్లు కూడా చెప్పాలని కోరారు. వాస్తవం ఏమిటంటే.. కమ్మలలో కొంతమంది కాపులున్నారని, అలాగే కాపులలో కూడా కమ్మలు ఉన్నారని అన్నారు. అందుకు ఉదాహరణగా చిరంజీవిలో కళ్యాణ్, కళ్యాణ్‌లో చిరంజీవి ఉన్నారంటూ ముక్తాయింపు ఇచ్చారు.

No comments:

Post a Comment