
ప్రజారాజ్యం పార్టీ ఎందుకు విఫలమైంది? రాజకీయాల్లో చిరు ఎందుకు సఫలం కాలేకపోయారు? ఈ తరహా ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు మెగా స్టార్. సరైన కోర్ టీమ్ ను ఎంపిక చేసుకోలేకపోవడమే తన ఓటమికి కారణమని ఒప్పుకున్నారు. తననెవరూ వెన్ను పోటు పొడవలేదని స్పష్టంచేశారు. 60వ జన్మదినోత్సవం సందర్భంగా మీడియాతో తన సినీ, రాజకీయ జీవితాలకు సంబందించిన ఆసక్తిదాయక విషయాలను వెల్లడించారు. రాజకీయాలలోకి వచ్చినందుకు ఏ మాత్రం చింతించడం లేదని , ప్రజా సేవ చేసేందుకు దీన్నొక అవకాశంగా భావించానని అన్నారు. ప్రజల తరఫున పోరాడేందుకు తానెప్పుడూ సిద్ధమేనని, ఇప్పటికీ ప్రజలు తనపై ఆదరాభిమానాలు చూపుతుతున్నారని అన్నారు. రాజకీయంగా సఫలం కాలేకపోయినా, ఈ రంగంలోకి రావడం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. కాగా.. ఎనిమిదేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నా, చిత్రసీమకు సంబంధించిన వేడుకలకు వెళ్లినప్పుడు మళ్లీ సొంత సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నట్లు ఉంటుందని సంతోషం వ్యక్తంచేశారు.
No comments:
Post a Comment