Monday 8 February 2016

పవన్ కి పోటీగా మహేష్ బాబు

05892056023

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కి పోటీగా మహేష్ బాబు వస్తున్నాడు. దీంతో మహేష్ బాబు దూకుడుకి ఎలాగైనా బ్రేక్ వేయాలని పవన్ చూస్తున్నాడని అంటున్నారు. ‘బ్రహ్మోత్సవం’ మూవీతో సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నాడు. ఈ మూవీని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేస్తున్నాడు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వస్తున్న ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ కావటంతో , బ్రహ్మోత్సవం మూవీపై అందరిలోనూ భారీ అంచనాలు పెరిగాయి. ఇక బ్లాక్‌బస్టర్ హిట్ ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్ చేస్తోన్న సినిమా బ్రహ్మోత్సవం కావడంతో ఈ సినిమాపై మార్కెట్ లోనూ భారీ అంచనాలు పెరిగాయి. జనవరి 1న విడుదలైన టీజర్ కారణంగా ఈ సినిమాపై అంచనాలు కూడ పెరిగాయి. పీవీపీ సంస్థ భారీ పెద్ద ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఏప్రిల్ నెలాఖర్లో విడుదల కానుండగా, ఏప్రిల్ మొదటివారంలో ఆడియో రిలీజ్ జరుపుకోనుంది. అంటే ఏప్రిల్ 8న ‘బ్రహ్మోత్సవం’ ఆడియో రిలీజ్ ఉండే విధంగా పీవీపీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇక అదే రోజు పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అవుతుంది. పవన్ కళ్యాన్ మూవీ రిలీజ్ రోజునే, బ్రహ్మోత్సవం మూవీ ఆడియో ఫంక్షన్ చేస్తే…మార్కెట్ లో హైప్ క్రియేట్ అవుతుందని…అలాగే సర్ధార్ సాధించిన బాక్సాపీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేయటానకి మార్కెట్ పరంగా ఇది హెల్ప్ అవుతుందని అంటున్నారు.

No comments:

Post a Comment