Monday 8 February 2016

ఆ రేటుకే బుక్ చేసుకోమంటుంది

0880452012010

ఏదో అనుకొని మరేదో చేస్తే ఏమవుతుంది? ఉన్నది పోతుంది. ఆ విధంగా ప్రస్తుతం కాజల్ పరిస్థితి తయారయిందని అంటున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న కాజల్, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ మంచి పేరు తెచ్చుకోవాలని తెగ ప్రయత్నాలు చేసింది. అంతే కాకుండా, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కొంత కాలం దూరం ఉండేందుకు కూడ ప్రయత్నించింది. చివరరకు ఆ రెండు ప్రయత్నాలు బెడిసికొట్టడంతో…వెంటనే జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రయత్నాలను చేస్తుంది. గతంలో కాజల్ తెలుగు సినిమాలను పక్కన పెట్టి హిందీ సినిమాలపై పూర్తి దృష్టి పెట్టడమే కాకుండా, సౌత్ లో భారీగా రెమ్యునరేషన్ పెంచేసింది. దీంతో అప్పటివరకూ టాప్ హీరోలతో చేసిన కాజల్ కి అవకాశాలు తగ్గిపోయాయి. అలాగని హిందీలో ఈ బ్యూటీకి మంచి సినిమా ఆఫర్స్ వచ్చాయంటే అదీనూ లేదు. దీంతో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి నష్టం వాటిల్లుతుంది. ఇదంతా తను రెమ్యునరేషన్ పెంచటం వల్లనే అని గ్రహించింది. అందుకే బాలీవుడ్ లో ప్రయత్నిస్తూనే సౌత్ లోనూ మూవీలను చేయాలన్నదే కాజల్ నిర్ణయం. దీంతో పెంచిన రెమ్యునరేషన్ ని భారీగా తగ్గించింది. ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీలకి తనని పాత రేటుకే బుక్ చేసుకోవచ్చనే మెసేజ్ ని కాజల్ పంపిందట. అందుకే ప్రస్తుతం సౌత్ లో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, విజయ్, ,అజిత్ వంటి మూవీల్లో ఆఫర్స్ ని తెచ్చుకోగలిగిందని అంటున్నారు.

No comments:

Post a Comment