Saturday 6 February 2016

బ్రహ్మానందానికి 30 ఇయర్స్ పృథ్వీ షాక్

brammi-78387383

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా మారిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ, తాజాగా బ్రహ్మానందానికి గట్టి షాక్ ఇచ్చాడంట. ప్రస్తుతం పృథ్వీ ఇండస్ట్రీలో తన హావాని పెంచుకుంటున్నారు. రీసెంట్ గా బాహుబలి2లో పృథ్వీ ఛాన్స్ ని దక్కించుకొని మరింత పాపులర్ అయ్యాడు. ‘బాహుబలి 2’లో రాజరికానికి సంబంధించిన మంత్రి పాత్రను పోషించనున్నట్టుగా పృథ్వీ తన రోల్ ని రివీల్ చేశాడు. ఈ పాత్ర తనకి ఎంతగానో నచ్చిందని బాహుబలి అప్ డేట్స్ ని చెప్పుకొస్తున్నాడు. దీంతో కమెడియన్ పృథ్వీకి సపరేట్ మార్కెట్ ఏర్పడింది. దీని కారణంగా తనతో సోలో సినిమాలు చేస్తే ఎలా ఉంటుంది అంటూ కొంత మంది నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఆ విధంగా ఆలోచించిన కొందరు నిర్మాతలు పృథ్వీతో హీరోగా ఓ మూవీకి రంగం సిద్ధం చేశారు. గతంలో బ్రహ్మానందం చేయాల్సిన ఆ మూవీలో కొద్ది పాటి మార్పులు చేసి పృథ్వీ కి వినిపించారంట. అందుకు పృథ్వీ సైతం తను లీడ్ రోల్ పాత్రలను చేయటానికి రెడీ అయ్యాడు. ఈ మధ్య కాలంలో యంగ్ కమెడియన్స్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపుతున్నారు. దీని కారణంగా బ్రహ్మానందం హావా కొంత మేర తగ్గింది. ఇప్పుడు పృథ్వీ సైతం మరోసారి బ్రహ్మానందానికి ఝలక్ ఇచ్చాడని అంటున్నారు. ఇక కొంత మంది రచయితలు సైతం తనని దృష్టిలో పెట్టుకుని కథలని క్రియేట్ చేయటానికి రెడీ అయ్యారంట.

No comments:

Post a Comment