Saturday 6 February 2016

జ‌న‌సేన ప‌గ్గాలు మారుతున్నాయా..!

janasena-28822

మొన్న‌టివ‌రకూ మెగా ఫ్యామిలీలో భ‌గ్గుమ‌న్న విభేదాలు సద్దుమ‌ణిగాయా? మెగా బ్ర‌ద‌ర్స్ మ‌ళ్లీ ఒక్క‌టి కాబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ త‌న‌ని లైట్ తీసుకుంద‌ని భావించిన చిరంజీవి.. త‌మ్ముడి జ‌న‌`సేన‌`లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారా? త‌మ్ముడితో క‌లిసి రాష్ట్రంలో చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది.
చిరంజీవి పుట్టిన రోజు వేడుక‌లు మొద‌లైన ద‌గ్గ‌ర నుంచీ.. మెగా బ్ర‌ద‌ర్స్ చిరంజీవి, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ధ్య రిలేష‌న్స్ లైన్‌లోకి వ‌చ్చాయి. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ గెట‌ప్‌లో చిరంజీవి ఇంటికి వెళ్ల‌డం.. త‌రువాత మెగాస్టార్ చిరంజీవి.. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సెట్లో త‌ళుక్కున మెర‌వ‌డం వంటి సంఘ‌ట‌న‌లు వీరి మ‌ధ్య దూరాన్ని త‌గ్గించేశాయి. ప్ర‌స్తుతం మ‌రో వార్త ఇండ‌స్ట్రీలో చ‌క్క‌ర్లు కొడుతుంది. జ‌న‌సేన పార్టీతో చిరంజీవి క‌ల‌వ‌బోతున్నార‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ఏపీలో కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా ఉంది. అలాగే దేశంలోనూ ఆ పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. మ‌రో ప‌దేళ్ల వ‌ర‌కు వాళ్ల‌కు అవ‌కాశం వ‌చ్చేలా కూడా క‌నిపించ‌ట్లేదు. ఇటువంటి స‌మ‌యంలో పార్టీలోనే ఉంటే.. అది వ్య‌క్తిగ‌తంగానూ మైన‌స్సే అని చిరు భావిస్తున్నార‌ట‌.
మ‌రోప‌క్క ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా మారాడు. ప్ర‌స్తుతం ఆ పార్టీని పూర్తిస్థాయిలో ప‌వ‌న్ ఒక్క‌డే న‌డ‌ప‌లేక‌పోతున్నాడు. అందుకే ఇటువంటి స‌మ‌యంలో తమ్ముడితో ఉంటే మంచిద‌నే అభిప్రాయానికి చిరు వ‌చ్చాడ‌ని స‌మాచారం. ఇటువంటి స‌మ‌యంలో ప‌వ‌న్‌తో క‌లిసి రాష్ట్రంలో చ‌క్రం తిప్పాల‌ని చూస్తున్నాడు చిరంజీవి. మొన్న స‌ర్దార్ సెట్ లో ప‌వ‌న్‌ను క‌లిసిన‌పుడు కూడా చిరంజీవి ఈ విష‌యంపై చ‌ర్చించార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. దీంతోపాటు త‌న కుమార్తె శ్రీ‌జ పెళ్లి విష‌యంపై కూడా ప‌వ‌న్ తో మాటామంతి జ‌రిపాడ‌ని.. ఆ త‌ర్వాత స‌ర్దార్ ముచ్చ‌ట్లు తెలుసుకున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి చిరంజీవి జ‌న‌సేన‌లో చేరితే.. అన్న‌కే ప‌వ‌న్‌ పార్టీ ప‌గ్గాలు అప్ప‌జెపుతాడ‌న్న వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment