Sunday 3 January 2016

లెజెండ్ మూవీకి ఇంకో రికార్డా?

legend-record

బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ రికార్డుల మీద రికార్డులు తిరగ రాస్తోంది.ఇప్పటికే టీ – టౌన్‌లో.. ఎన్నో రికార్డుల‌ను తుడిచేసిన ‘లెజెండ్‌’ తాజాగా మ‌రో రికార్డు సొంతం చేసుకుంది. ప్రొద్దుటూరులోని అర్చన థియేటర్‌లో 525 రోజులు పూర్తిచేసుకుంది. ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా 75 వారాలు ప్ర‌ద‌ర్శిత‌మైంది.ఓవిధంగా.. చెప్పుకుంటే ఇది సెకండ్ ప్లాటినమ్ జూబ్లీ . దీంతో సెప్టెంబర్ 6న బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞ జన్మదిన వేడుకతోపాటు లెజెండ్ సెకండ్ ప్లాటినమ్ జూబ్లీ సెలబ్రేషన్స్‌ను కడప జిల్లాలో ఘనంగా చేయనున్నారు.
అభిమానులూ పండుగ చేస్తోండి :-
వారాహి చలనచిత్ర సమర్పణలో.. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘లెజెండ్‌’ని తెరకెక్కించింది. దేవీశ్రీ అందించిన స్వ‌రాలు సినిమా విజ‌యంలో కీల‌క భాగం పంచుకున్నాయి. గత ఏడాది మార్చి 28న విడుదలై .. అన్ని చోట్లా.. యునానిమ‌స్‌గా సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది.తాజాగా.. ఈ సినిమా క‌డ‌ప గ‌డ‌ప‌లో.. ఒకే థియేటర్‌లో 75 వారాలు ఆడడం.. నంద‌మూరి అభిమానుల్లో లెక్క‌కు మిక్కిలి ఆనందం నింపింది. రికార్డులు రాయ‌ల‌న్నా మేమే.. తిరగరాయాలన్నా మేమే అంటూ.. సోష‌ల్ మీడియా వేదిక‌గా..నంద‌మూరి అభిమాన గ‌ణం సంబ‌రాలు చేసుకుంటోంది.
please share it..

No comments:

Post a Comment