Sunday 3 January 2016

బాలయ్య 100వ మూవీకి ఛాన్స్ కొట్టేసింది

87405450101010

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన మూవీ డిక్టేటర్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ, రిలీజ్ కి సిద్ధంగా ఉంది. డిక్టేటర్ మూవీ అవుట్ పుట్ అద్భుతంగా రావటంతో, ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ పై చిత్ర టీం వేగంగా పనిచేస్తుంది. అయితే డిక్టేటర్ మూవీలో హీరోయిన్ గా నటించిన అంజలికి బాలకృష్ణ మరో ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే తాజాగా బాలకృష్ణ, అంజలిని తెగ పొగుడుతూ మాటలు చెప్పాడని అంటున్నారు. శ్రీవాస్ దర్శకత్వంలో వచ్చిన ‘డిక్టేటర్’ చిత్రంలో అంజలి .. సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల జరుగుతుంది. అయితే హీరోయిన్ అంజలిని ఉద్ధేశించి బాలకృష్ణ చెప్పిన మాటలు ఇప్పుడు అందరిని ఆలోచింప చేస్తున్నాయి. “ఈ సినిమా అంజలికి మంచి పేరు తీసుకురావటమే కాక, అంజలి చాలా చక్కగా నటించిందనీ, విషయాన్ని వెంటనే గ్రహించి దాన్ని ప్రెజెంట్ చేయడం ఆమెకి బాగా తెలుసంటూ” బాలకృష్ణ చెప్పుకొచ్చాడు. అయితే బాలకృష్ణని ఇంప్రెస్ చేసిన అంజలి, బాలకృష్ణ 100వ మూవీలోనూ హీరోయిన్ గా ఆఫర్ ని కన్ఫర్మ్ చేసుకుందని అంటున్నారు. ఇందుకు బాలకృష్ణ, అంజలికి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
please share it..

No comments:

Post a Comment