Sunday 3 January 2016

చిరంజీవి అంత పని చేస్తాడా?

84050450101010

గతంలో చిరంజీవి ఏదైనా మూవీకి ఒప్పుకునే ముందు రెమ్యునరేషన్ ని పక్కన పెట్టి కథని ఫైనల్ చేస్తాడు. కానీ ప్రస్తుతం చిరంజీవి కథతో పాటు రెమ్యునరేషన్ ని సైతం పట్టించుకుంటున్నాడంట.చిరంజీవి తన 150వ సినిమాకి సంబంధించిన రెమ్యునరేషన్ వ్యవహారంలో చిరు ప్రవర్తిస్తున్న తీరు అందరిని ఆశ్ఛర్యపరుస్తుంది. వినాయక్ దర్శకత్వంలో చిరు హీరోగా ‘కత్తి’ రీమేక్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మూవీలో నటించేందుకు చిరంజీవి ఏకంగా 28 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్ కింద తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయ్యే లోపు 18 కోట్ల రూపాయలను చెల్లించాల్సిందిగా మెగాస్టార్ కండిషన్ పెట్టాడు. ఇక మూవీకి 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని అంటున్నారు. అయితే రెమ్యునరేషన్ విషయంలో మాత్రం చిరంజీవి ఈ సారి స్ట్రిక్ట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. తను చెప్పిన ప్రకారం మొదటి షెడ్యూల్ లోపు రెమ్యునరేషన్ చెల్లించలేకపోతే షూటింగ్ షెడ్యూల్స్ ని నిలిపివేసే ఛాన్స్ కూడ ఉంటుందని అంటున్నారు. మొత్తంగా చిరు అన్నంత పని చేస్తారా? అన్నది ఇక్కడ అందరిలో కలుగుతున్న ప్రశ్నగా మారింది.
please share it..

No comments:

Post a Comment