Sunday 3 January 2016

రవితేజ కథని నాని నో అనేశాడు

0504010101010

టాలీవుడ్ లో ఓ మూవీ బయటకు వస్తుందంటే, ఆ కధని అప్పటికే పలువురు హీరోలు రిజెక్ట్ చేయగా..చివరికి ఆ హీరో వద్దకు చేరుకుంటుందనేది తెలిసిన విషయమే. ఓ కథని పట్టుకుని డైరెక్టర్ ఓ హీరోకి చెబుతాడు. అయితే ఆ హీరో కథని రిజెక్ట్ చేయటంతో, మరో హీరో వద్దకు ఆ కథ ట్రావెల్ చేస్తుంది. ఇలా పలు హీరోల దగ్గర నుండి ఏదొక హీరో దగ్గర ఆ కథ ఆగుతుంది. ఆ విధంగా ప్రస్తుతం రవితేజ కి సంబంధించిన ఓ కథని రవితేజ రిజెక్ట్ చేశాడు. తరవాత అది నాని వద్దకు చేరకుంది. నాని సైతం ఆ కథని రిజెక్ట్ చేయటంతో ఇప్పుడు విశేషంగా మారింది. ఒక వ్యక్తి జీవితంలోని సంఘటనలు జ్ఞాపకాలతో చూపించిన చిత్రమే ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తమిళ్లో వచ్చిన ‘ఆటోగ్రాఫ్’ కి రిమేక్. తమిళ్లో చేరన్ హీరోగా.. తన దర్శకనిర్మాణంలో రూపొందింది బ్లాక్ బస్టర్ ని సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ రెడీ అవుతుంది. మొదటి భాగంలో స్నేహ, గోపిక లు నటించగా, ఇప్పుడు సీక్వెల్ లో నయనతార నటిస్తుంది. అలాగే తెలుగులో ఈ మూవీని రవితేజతో చేయించాలని చూడగా, అందుకు రవితేజ నో అనేశాడు. దీంతో చేరన్ తెలుగు వెర్షన్ కి నాని ను సంప్రదించారు. నాని సైతం ఇందుకు నో అనేశాడంట. అయితే నాని ఈ మూవీలో నటిస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు. మొత్తంగా ఓ మంచి మూవీని నాని వద్దనటంతో అందరూ నానిని టార్గెట్ చేసుకొని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
please share it..

No comments:

Post a Comment