Sunday, 31 January 2016

హీరోయిన్ కి నడుం నొప్పి తెచ్చిన అల్లుఅర్జున్

05606304055120

మెగాహీరో అయిన అల్లుఅర్జున్ అంటే అందరికి గుర్తుకు వచ్చేది తను చేసే డ్యాన్స్ లు. డ్యాన్స్ విషయంలో అల్లుఅర్జున్ బాడీ స్ప్రింగ్ లా మారుతుంది. అందుకే అల్లుఅర్జున్ మూవీలో నటించే హీరోయిన్స్ మాత్రం, డ్యాన్స్ విషయంలో అల్లుఅర్జున్ తో బాగా ఎంజాయ్ చేస్తారు. అలా అని వీరు మాత్రం ఛాలెంజింగ్ డ్యాన్స్ ని మాత్రం చేయరు. అల్లుఅర్జున్ అధిరే స్టెప్పులు వేస్తుంటే…వీరు మాత్రం వారి గ్లామర్ తో సున్నితంగా డ్యాన్స్ వేస్తారు. కానీ అల్లు అర్జున్ తాజా మూవీలోని హీరోయిన్, ఈ హీరోతో పోటీగా డ్యాన్స్ చేయటానికి ప్రయత్నించి నడుం నొప్పి తెచ్చుకుందని అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ సరైనోడు మూవీలో అల్లుఅర్జున్ సరసన నటిస్తుంది. తాజాగా ఓ మాస్ సాంగ్ లో అల్లుతో కలిసి చిందేసింది. అద్భుతంగా డాన్స్ చేసే హీరోలతో ఇలా డ్యాన్స్ చేయటం నిజంగా గ్రేట్ అని అంటున్నారు. డాన్స్ లో ఎన్నో నైపుణ్యాలని తెలుసుకున్నాని చెప్పింది. సరైనోడు మూవీ కోసం తాజాగా ఒక మాస్ సాంగ్ ను చిత్రీకరించారు. ఇందులో బన్నీ స్పీడ్ ను అందుకుంటూ స్టెప్పులు వేసిన రకుల్ కి నడుం పట్టేసిందట. అల్లఅర్జున్ వేగానికి తట్టకోలేము, నడుం నొప్పి ఇప్పట్లో తగ్గేలా లేదు అని చెప్పుకొచ్చిందట.

No comments:

Post a Comment