Sunday 31 January 2016

చిరు రిజెక్ట్ చేసిన కథలో రవితేజ

40501207840



మెగస్టార్ చిరంజీవి కోసం పూరీ రెడీ చేసిన 150వ సినిమా కథ, చిరు నుండి రిజెక్ట్ అయింది. ఇప్పుడు అదే కథని రవితేజ హీరోగా, పూరీ దర్శకత్వంలో బయటకు రానుంది. ఇదే ఇండస్ట్రీలో చర్ఛనీయాంశంగా మారుతుంది. రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ ఒక సినిమా చేయనున్నాడనే విషయం ఆ మధ్య బాగా వినిపించింది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. చిరంజీవి 150వ సినిమాగా ‘ఆటోజాని’ చేయాలని పూరి జగన్నాథ్ గతంలో విశ్వప్రయత్నం చేశాడు. ఇందుకోసం గోవాలో దాదాపు నెల రోజుల పాటు గడిపాడు. కథ కోసం అన్ని రోజులు ఏకాంతంగా గడిపిన పూరీకి, తరువాత అనుకోని విధంగా చిరు నుండి కథ రిజెక్ట్ కావటంతో బాగా నిరుత్సాహ పడ్డాడు. కానీ ఇప్పడు ఆ కథలో కొద్దిపాటి మార్పులు చేసి, రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మలిచి, సినిమాను తెరకెక్కించనున్నాడు. పూరి జగన్నాథ్, రవితేజ కాంబినేషన్ లో పలు హిట్ మూవీలు వచ్చాయి. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి వంటి కాంబినేషన్ సినిమాలు బాక్సాపీస్ వద్ద స్టామినాని చూపాయి. ఇక చిరు కోసం రెడీ చేసిన కథ పవర్ఫుల్ గానే ఉంటుంది కాబట్టి, అటువంటి కథలో రవితేజ నటించటం అంటే కచ్ఛితంగా ఈ సినిమా బాక్సాపీస్ ని షేక్ చేస్తుందని అంటున్నారు.

No comments:

Post a Comment