Sunday 31 January 2016

తమ్ముడూ..రెండు నిముషాలు నటించవచ్చా ?

404542404440

తాజాగా ఇండస్ట్రీలో చర్ఛనీయాంశంగా మారిన టాపిక్, ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ స్పాట్ కి చిరంజీవి రావటం. రీసెంట్ గా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ జరుగుతోన్న లొకేషన్ కి చిరంజీవి వెళ్లడంతో ఇది టాలీవుడ్ లోనే ప్రధాన వార్తగా మారిందనే విషయం తెలిసిందే. చిరంజీవి తన 150వ సినిమా అయిన ‘కత్తి’ రీమేక్ కి సన్నాహాలు జరుగుతూనే, మరోవైపు తమ్ముడు మూవీ సెట్స్ లో సందడి చేయటం మెగాఫ్యాన్స్ కి ఎంతగానో అలరిస్తుంది. గతంలో చిరంజీవి ‘బ్రూస్ లీ’ సినిమాలో అతిథి పాత్రలో అలరించారు. ఇప్పుడు కూడ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీలో తమ్ముడి సరసన కాసేపు చిరంజీవి కనిపించనున్నాడని అంటున్నారు. అందుకే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్స్ కి చిరంజీవి వచ్చాడని అంటున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో వేసిన స్పెషల్ సెట్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ శరవేంగంగా జరుగుతుంది. ఈ సెట్ లోనే చిరంజీవి తను సర్ధార్ మూవీలో ఏ విధంగా ఎంట్రి ఇవ్వనున్నాడు, అలాగే దానికి సంబంధించిన పూర్తి వివరాలను రోజంతా ఉండి తెలుసుకున్నాడు. గతంలో చిరంజీవి సినిమాల్లో గెస్టుగా పవన్ కాసేపు కనిపించి ఫ్యాన్స్ కి ఆనందాన్ని కలిగించాడు. ఇప్పుడు అదే విధంగా పవన్ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో అలరించనున్నారని అంటున్నారు. మొత్తంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సెట్స్ లో చిరు సందడి వెనుక ఉన్న సీక్రెట్ ఇప్పుడు బయటకు వచ్చిందని అంతటా తెలుస్తుంది.

No comments:

Post a Comment