Friday 29 January 2016

రివ్యూ : క‌ళావ‌తి

589056530

సినిమా: క‌ళావ‌తి
జాన‌ర్‌: హ‌ర్ర‌ర్‌+కామెడీ
న‌టీన‌టులు: సిద్ధార్థ్‌, హ‌న్సిక‌, త్రిష‌, పూన‌మ్ బాజ్వా, సుంద‌ర్.సి త‌దిత‌రులు
సంగీతం: హిప్ హాప్ త‌మీజ‌
నిర్మాత‌లు: గుడ్ ఫ్రెండ్స్ సంస్థ‌
ద‌ర్శ‌క‌త్వం: సుంద‌ర్‌.సి
రిలీజ్ డేట్‌: 29 జ‌న‌వ‌రి, 2016
హర్రర్ కామెడీ… ఇటీవల కాలంలో ఈ జోనర్‌లో వ‌స్తున్న సినిమాల‌కు తెలుగులో మంచి ఆద‌ర‌ణే ఉంటోంది. ప్రేమ క‌థా చిత్ర‌మ్ నుంచి స్టార్ట్ అయిన ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. నేడు తెరమీదికొచ్చిన ‘కళావతి’ సినిమా కూడా ఆ జోనర్ లోనిదే. దర్శకుడు సుందర్.సి గత సినిమా ‘అరణ్మనై’ (చంద్రకళ) విజయం సాధించడంతో దానికి సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు. చంద్ర‌క‌ళ‌కు సీక్వెల్‌గా వ‌చ్చిన క‌ళావ‌తి ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పించిందో డెక్క‌న్‌రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.
క‌ళావతి స్టోరీ:
ఓ జమీందార్ బంగ్లా చుట్టూ తిరుగుతోంది కళావతి కథ. ఆ బంగ్లాలో ఉన్న దెయ్యం అక్కడికి వచ్చే వారిని వెంటాడుతూ భయపెడుతూ ఉంటుంది. ఆ దెయ్యం మూలంగానే జమీందార్ కోమాలోకి వెళతాడు. అతని పెద్ద కొడుకుపై కూడా దెయ్యం దాడి చేస్తోంది. ఆ సమయంలో అక్కడ ఉన్న అతీంద్రియ శక్తుల పని పట్టాలనుకుంటాడు జమీందార్ చిన్న కొడుకు ముర‌ళీ (సిద్దార్థ్), అందుకు అతడికి కాబోయే భార్య (త్రిష) సాయం చేస్తుంది. ఈ పోరాటంలో బంగ్లాలో ఉన్న దెయ్యం చనిపోయిన తన చెల్లెలు కళ(హాన్సిక) అని తెలుసుకుంటాడు సిద్దార్థ్. అసలు కళ దెయ్యంగా ఎలా మారింది..? చివరకు సిద్దార్థ్ కళకు ఎలా విముక్తి కలిగించాడు అన్నదే మిగతా కథ.
క‌ళావ‌తి మూవీ విశ్లేష‌ణ‌:
కథనం విషయానికొస్తే… ఇదో పరువు హత్య ఉదంతం. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని నిండు గర్భవతి అని కూడా చూడకుండా విషం పెట్టి అప్పటికీ త్వరగా చావడంలేదని గొంతు పిసికి చంపేస్తాడు తండ్రి. త‌న కూతురు కులం త‌క్కువ వాడిని పెళ్లి చేసుకుంద‌న్న కార‌ణంతో ఇలా చేస్తాడు. ఆ చనిపోయిన అమ్మాయి పగ తీర్చుకోవడమే మిగతా సినిమా. దెయ్యాలు, ఆత్మలకి లాజిక్ ఉన్నా లేకపోయినా సినిమాకి లాజిక్ ఉండాలి. ఈ సినిమాలో దర్శకుడు వాటిని అసలు పట్టించుకోలేదు. పోలీస్ కస్టడీలో ఉన్న మురళీ (సిద్దార్థ్)కి బెయిల్ ఎవరిచ్చారో తెలీదు కాని సడెన్‌గా పాటలో ప్రత్యక్షమవుతాడు. అప్పటివరకు సైడైపోయిన త్రిష కూడా ఆ పాటలో కనిపిస్తుంది. మరో విషయం చెప్పుకుంటే.. వరుసకు బావ అయ్యే ఓ పాత్ర(సూరి)ని బావమరిది పాత్రధారి (మనోబాల) కాసేపు అల్లుడు గారు అంటాడు మరి కాసేపు బావ అంటాడు. ఇది సంభాషణల లోపమో.. పాత్ర చిత్రణలో స్పష్టత లేకపోవడమా అన్నది దర్శకుడికే తెలియాలి. ఇలా ఈ సినిమా లోపాల పుట్టా విప్పితే చిత్రగుప్తుడి వద్ద ఉన్న పాపాల చిట్టా అంత అవుతుంది.
న‌టీన‌టుల పెర్పామెన్స్‌:
తొలిసారిగా హర్రర్ జానర్ లో నటించిన సిద్దార్థ్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చాలా రోజులుగా సరైన హిట్ లేని సిద్దూకి ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చింది. త్రిష నటనతో పాటు గ్లామర్ షోతోనూ ఆకట్టుకుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్, బీచ్ సాంగ్ తో కమర్షియల్ కంటెంట్ ను యాడ్ చేసింది. ఎంట్రీ సాంగ్‌లో బికినీ వేసుకుని ఆమె అందాలు ఆర‌బోసిన తీరు మంచి కిక్ ఇస్తుంది. చంద్రకళ సినిమాలో కనిపించిన తరహా పాత్రలో హన్సిక మరోసారి మెప్పించింది. ముఖ్యంగా చెల్లెలుగా, తరువాత దెయ్యంగా కూడా అద్భుతంగా నటించింది. కోవై సరళ, సూరిల కామెడీ టైమింగ్ బాగుంది.
టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
హిప్ హాప్ తమీజా సంగీతంతో సినిమా స్థాయిని పెంచాడు. పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం బాగా కుదిరింది. సెంథిల్ కుమార్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. నైట్ అండ్ డే ఎఫెక్ట్స్ బాగా చూపించారు. విజువ‌ల్స్ ప‌రంగా ఇంకా బెట‌ర్‌గా ప్లాన్ చేసుకుని ఉండాల్సింది. ఆర్ట్ వర్క్ ఓకే. ఎడిట‌ర్ శ్రీకాంత్ ఇంకాస్త కేర్ తీసుకుని ఫస్టాఫ్‌లో బోరింగ్ సీన్లు ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా చాలా బాగుండేది.
సుంద‌ర్.సి డైరెక్ష‌న్ క‌ట్స్‌:
సుందర్ డైరెక్షన్ విషయానికి వస్తే…. పెద్దగా రిస్క్ తీసుకోకుండా చంద్రకళ తరహా కథనే రాసుకున్నాడు. అదే ప్యాటర్న్ లో కథను రన్ చేసాడు. అయితే మొదటి భాగం డిజప్పాయింట్ చేశాడు. బలమైన సీన్స్ లేకపోవడంతో తేలిపోయింది. ఎక్కువగా కమెడియన్స్ మీద బండి లాగించాడు. అయితే ఓ ట్విస్ట్ ను దాచి పెట్టి రెండో భాగం మీద క్యూరియాసిటీ పెంచాడు. రెండో భాగం మీద బాగా కాన్ సన్ ట్రేట్ చేశాడు. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఆకట్టుకున్నాడు. భయపెడుతూ.. నవ్విస్తూ… కథను ముందుకు తీసుకెళ్లాడు. హన్సిక మర్డర్ ఎపిసోడ్ ను బాగా ప్లాన్ చేశాడు. ఓవ‌రాల్‌గా స్ర్కీన్ ప్లే కాస్త యావ‌రేజ్‌గా ఉన్నా ద‌ర్శ‌కుడిగా మాత్రం స‌క్సెస్ అయ్యాడు.
ప్లస్ పాయింట్స్ :
– సెకండ్ హాఫ్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే
– రెండో భాగంలో హన్సిక ఎపిసోడ్
– త్రిష సిద్ధార్థ బీచ్ సాంగ్
– సుందర్ సి…పెర్ ఫార్మెన్స్
– ఖుష్బూ స్పెషల్ ఎంట్రీ
– సినిమాటోగ్ర‌ఫీ
– ఆర్ ఆర్‌
మైనస్ పాయింట్స్:
– పాటలు, రీరికార్డింగ్
– ఫస్టాఫ్ లో కొన్ని బోరింగ్ సీన్స్
– రొటీన్ హర్రర్ కామెడీ జానర్
ఫైన‌ల్‌గా…
చంద్ర‌క‌ళ టైప్‌లోనే వ‌చ్చి హ‌ర్ర‌ర్ కామెడీ ప్రేక్ష‌కుల‌ను మెప్పించే సినిమా క‌ళావ‌తి. బీ,సీ సెంట‌ర్స్ ప్రేక్ష‌కులు క‌ళావ‌తిని బాగా ఎంజాయ్ చేస్తారు.
క‌ళావ‌తి మూవీ డెక్క‌న్ రిపోర్ట్‌.కామ్ రేటింగ్‌: 2.75

No comments:

Post a Comment