Friday, 29 January 2016

రివ్యూ : సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు

0480450850455

సినిమా: సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు
న‌టీన‌టులు: రాజ్‌త‌రుణ్‌, ఆర్త‌నాస్‌, రాజా ర‌వీంద్ర‌, ఆద‌ర్శ్, ష‌క‌ల‌క శంక‌ర్ త‌దిత‌రులు
సుంద‌ర్‌: గోపీసుంద‌ర్‌
నిర్మాత‌లు: శైలేంద్ర‌బాబు, కెవి.శ్రీథ‌ర్‌రెడ్డి, హ‌రీష్ దుగ్గిశెట్టి
దర్శ‌క‌త్వం: శ్రీనివాస్ గవిరెడ్డి
ర‌న్ టైం: 132 నిమిషాలు
రిలీజ్ డేట్‌: 29 జ‌న‌వ‌రి, 2016
ఉయ్యాల జంపాలా, సినిమా చూపిస్త మావ‌, కుమారి 21 ఎఫ్ సినిమాల‌తో టాలీవుడ్‌లో ఎంట్రీతోనే హ్యాట్రిక్ చిత్రాల హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఈ మూడు సినిమాల త‌ర్వాత రాజ్ త‌రుణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో రాజ్ తాజాగా న‌టించిన సీత‌మ్మ అందాలు – రామ‌య్య సిత్రాలు సినిమా ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు ఆక‌ట్టుకుందో డెక్క‌న్ రిపోర్ట్‌.కామ్ స‌మీక్ష‌లో చూద్దాం.
స్టోరీ:
అందమైన పల్లెటూరు అందులో సీతామాలక్ష్మి (ఆర్త‌నాస్‌), శ్రీరామ్ (రాజ్‌తరుణ్) చిన్నప్పటి నుండి మంచి స్నేహితులుగా ఉంటారు. శ్రీరామ్‌కు సీతా మ‌హాల‌క్ష్మి అంటే ఎంతో ఇష్టం. కానీ శ్రీరామ్ అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరుగుతుండ‌డం ఆమెకు న‌చ్చ‌దు. శ్రీరామ్ ప‌దే ప‌దే ప్రేమించ‌మ‌ని వెంట‌ప‌డుతుంటాడు. చివ‌ర‌కు శ్రీరామ్ ప్రేమ‌లో ప‌డుతుంది సీతామ‌హాల‌క్ష్మి. సీతా మ‌హాల‌క్ష్మి తండ్రి (రాజా ర‌వీంద్ర‌) ఆ ఊరికి ప్రెసిడెంట్‌. వీరిద్ద‌రి ప్రేమ విష‌యం ఈ ప్రెసిడెంట్‌కు తెలియ‌డంతో సీత‌కు వేరే పెళ్లి సంబంధం చూస్తాడు. ఇండియ‌న్ క్రికెట్ టీంకు ఎంపికైన ఆద‌ర్శ్ (ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌న్‌)ను సీత‌కు ఇచ్చి పెళ్లి చేయాల‌నుకుంటాడు. ఈ లోపు శ్రీరామ్ వెళ్లి ఆదర్ష్ కు తమ ప్రేమ వ్యవహారం చెపుతాడు..అయితే ఆదర్ష్ మాత్రం తనతో క్రికెట్ ఆడి గెలిచి సీతామాలక్ష్మి సొంతం చేసుకొమ్మని పందెం వేస్తాడు..పందెం కు సై అన్న శ్రీరామ్ గెలుస్తాడా లేదా..? సీతామాలక్ష్మి ఎలా దక్కించుకుంటాడు..? చివ‌ర‌కు స్టోరీ ఎలా మ‌లుపులు తిరిగింది అన్న‌దే మిగిలిన స్టోరీ.
న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌:
హ్యాట్రిక్ హిట్ల హీరో రాజ్‌త‌రుణ్ మ‌రోసారి యూత్‌ను ఎట్రాక్ట్ చేసే పాత్ర‌లో ప్రేక్ష‌కుల్ని మెప్పించాడు. అయితే రాజ్ డైలాగులు చెప్పేట‌ప్పుడు ఒకే స్టైల్‌ను ఫాలో అవ్వ‌డంతో అది కాస్త మూస ఫార్మాట్‌గా ఉంది. ఇక ఈ సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన అర్త‌న గ్లామ‌ర్ క్యారెక్ట‌ర్‌లోను…ప‌ల్లెటూరి అమ్మాయిగా త‌న పాత్ర వ‌ర‌కు ఓకే అనిపించింది. హీరోయిన్‌గా తండ్రిగా న‌టించిన రాజా ర‌వీంద్ర‌, విల‌న్ రోల్ చేసిన ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌న్ పాత్ర‌లు సినిమాకు త‌గిన‌ట్టుగా ఉన్నాయి. ఇక ష‌క‌ల‌క శంక‌ర్ కామెడీ థియేట‌ర్స్‌లో విజిల్ వేయించింది. రాజ్‌త‌రుణ్‌-ష‌క‌లక శంక‌ర్ మ‌ధ్య వ‌చ్చే కామెడీ సీన్లు కూడా బాగున్నాయి. మధునందన్, విజయ్, జోగినాయుడు, సురేఖావాణి, శ్రీలక్ష్మి, హేమ, రత్నసాగర్, నవీన్, భార్గవి మిగతా నటినటులు వారి పాత్ర మేరకు బాగానే ఆకట్టుకున్నారు.
టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ ఎన‌లైజింగ్‌:
ఈ సినిమాకు ప‌నిచేసిన సాంకేతిక నిపుణుల విష‌యానికి వ‌స్తే గోపీసుంద‌ర్ సంగీతానికి మంచి మార్కులేయాలి. రొమాంటిక్ సాంగ్‌కు అత‌డు అందించిన సంగీతం సూప‌ర్బ్‌గా ఉంది. ప‌ల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ సినిమాలో సీన్ల‌కు త‌గిన‌ట్టుగా ఆర్ ఆర్ క‌నెక్ట్ చేసి స‌క్సెస్ అయ్యాడు. సుద్దాల అశోక్‌తేజ, రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, వనమాలి, కృష్ణచైతన్య రాసిన లిరిక్స్ బాగున్నాయి. సినిమాటోగ్రాఫ‌ర్ విశ్వ ప‌ల్లెటూరి అందాల‌ను త‌న ప్రేముల్లో చ‌క్క‌గా బంధించాడు. ఇక కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్‌లో చాలా చోట్ల లోపాలు ఉన్నాయి. సినిమా ర‌న్ టైం 132 నిమిషాలే అయినా సినిమాలో చాలా బోరింగ్ సీన్లు ఉన్నాయి. నిర్మాణ విలువ‌లు సినిమాకు త‌గిన‌ట్టుగా ఉన్నాయి.
శ‌్రీనివాస్ గ‌విరెడ్డి డైరెక్ష‌న్ క‌ట్స్‌:
ఇక ఈ సినిమా కెప్టెన్ అయిన గ‌విరెడ్డి శ్రీనివాస్ విష‌యానికి వ‌స్తే ఈ సినిమా కోసం అత‌డు ఎంచుకున్న స్టోరీ చాలా పాత‌ది. హీరో పందెం లో గెలిచి హీరోయిన్ ని సొంతం చేసుకోవడం వంటివి చాల సినిమాల్లో మనం ఇప్పటికే చూసాం..కాకపోతే స్క్రీన్‌ప్లే తో జాగ్రత్త పడ్డాడు. ఇక సినిమా ఇంట‌ర్వెల్ వ‌ర‌కు ఎలాంటి ట్విస్టులు లేకుండా ముందుకు వెళ్లినా…ఇంట‌ర్వెల్ త‌ర్వాత సీతామ‌హాల‌క్ష్మి, శ్రీరామ్ ప్రేమ‌ను అర్థం చేసుకోవ‌డం త‌ర్వాత కాస్త ఊపందుకుంది. ఫైన‌ల్‌గా రొటీన్ స్టోరీ అయినా సినిమాలో కామెడీ, సాంగ్స్ కొత్త‌గా ఉండ‌డంతో పాటు క్లైమాక్స్‌లో అత‌డు ఎంచుకున్న క్రికెట్ నేప‌థ్యం కూడా కామెడీగా ఉండ‌డం సినిమాకు ఫ్ల‌స్ అయ్యాయి.
ప్లస్ పాయింట్స్‌:
– రాజ్ తరుణ్ యాక్టింగ్
– షకలక శంకర్ కామెడీ
– సంగీతం
– సినిమాటోగ్ర‌ఫీ
మైనస్ పాయింట్స్‌:
– రొటీన్ స్టోరీ
– క్లైమాక్స్‌
సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు డెక్క‌న్ రిపోర్ట్.కామ్ రేటింగ్‌: 2.5

No comments:

Post a Comment