Saturday 30 January 2016

రాత్రికి వ‌స్తానన్న ర‌కుల్

rakul-singhdd

టీ టౌన్ న‌యా బ్యూటీ ర‌కుల్ .. కొంటె స‌మాధానం చెప్పిందో అభిమానికి.దీంతో అమ్మ‌డి స‌మాధానం విన్న ఆ.. తుంట‌రి కుర్రాడికి దిమ్మ‌దిరిగిపోయింది.బ్రూస్లీ సినిమాలో త‌నదైన అందంతో రచ్చ ర‌చ్చ చేసిన ఈ భామ, మూవీ ప్ర‌మోష‌న్ కు సైతం ముందుంది.ఇందులో భాగంగా ఫ్యాన్స్ తో ట్విట్టర్ లో లైవ్ చాట్ లో పాల్గొంది.ఇక తుంటరి కుర్రాళ్ళు ఊరికే వదులుతారా..? లవ్యూ మొదలుకొని డేటింగ్ వరకు రకరకాల ప్రశ్నలు వేసి వారి ముచ్చట తీర్చుకున్నారు.అందులో మరో పురుష పుంగవుడు మాత్రం కాస్త ముందడుగేసి “నువ్వు నాకు రాత్రిళ్ళే ఎందుకు కలలో కనపడతావ్..?” అని అడిగాడు. దానికి రకుల్ కూడా “అవును నేను పగలంతా షూటింగ్ లో బిజీ” అని దీటుగానే బదులిచ్చింది. బ్రూస్లీ హీరోయిన్నా.. మజాకా..? అనిపించుకుంది.

No comments:

Post a Comment