Saturday 30 January 2016

ఆ రూమర్స్ నమ్మకండీ..ప్లీజ్

840501201.

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో గ్లామర్ హీరోయిన్స్ పై రూమర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ పై ఎక్కువుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. తను అందాలను చూపించటానికి రెమ్యునరేషన్ అడుగుతుందని, అలాగే దర్శకులతో డేటింగ్ చేసి పాత్ర నిడివి పెంచుకుంటుందని, ఇక నిర్మాతలకి అందుబాటులో ఉంటుందని…ఇలా రకుల్ ప్రీత్ సింగ్ పై వరుస గాసిప్స్ వస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఈ బ్యూటీ ఘూటుగానే స్పందించింది. ముఖ్యంగా తను కష్టపడతాను, అలాగే కష్టపడిన దానికి మాత్రమే రెమ్యునరేషన్ తీసుకుంటాను. పారితోషికం విషయంలో ఎవరినీ ఇబ్బందిపెట్టడం ఇప్పటి వరకూ జరగలేదు. అందాలను చూపించటం అనేది కథని బట్టి ఉంటుంది. ఏ సందర్భం లేకుండా కేవలం అందాలను చూపిస్తే…దర్శకులకి ఏమి వస్తుంది? అని లాజిక్కులతో అడుగుతుంది. ఇప్పటి వరకూ చాలా చిన్న సినిమాలు చేశాను, అలాగే పెద్ద సినిమాలు చేశాను. కిక్ 2, బ్రూస్ లీ వంటి సినిమాలు తనని నిరాశ పరిచినా, తనకి ఇంకా డిమాండ్ ఉండటానికి కారణం తన నటనే అని అంటుంది. అయితే రెమ్యునరేషన్ విషయంలో తను నిర్మాతలని ఇబ్బంది పెడుతున్నట్టు వచ్చిన వార్తల్లో మాత్రం ఏ మాత్ర నిజం లేదని చెప్పుకొచ్చింది. తన విషయంలో వచ్చే గాసిప్స్ ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మ వద్దని ముక్త కంఠంతో వేడుకుంటుంది ఈ బ్యూటీ.

No comments:

Post a Comment