Saturday 30 January 2016

పవన్ ని తక్కువ అంచనా వేయద్దు. మునిగిపోతారు?

4052010450

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ సినిమా బిజినెస్ పై ఇప్పటికే ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల వరకూ బిజినెస్ చేసిందని కొందరు అంటున్నారు. ఇందుకు కారణం శరత్ మరార్ నిర్మాణంలో బాబీ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు. నిర్మాణ విషయం లో నిర్మాత ఎక్కడా రాజీ పడటం లేదు. అలాగే పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న కాజల్ సైతం ఇందులో అందాలను తెగ ఆరబోసిందని అంటున్నారు. మార్చ్ 12న ఈ సినిమా ఆడియో వేడుకకి రెడీ అవుతుంది. దీంతో మరోవైపు ఈ సినిమా బిజినెస్ ఊపందుకుంటుంది. గతంలో పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా థియేటర్ పరంగా 75 కోట్ల బిజినెస్ ని చేసింది. ఇప్పుడు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా 85 కోట్ల వరకూ బిజినెస్ చేసిందని కొందరు అంటున్నారు. అయితే ఇప్పటికూ వరకూ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ అవుట్ పుట్ రెడీ కాక ముందే వీరంతా ఈ మూవీని కొనేసుకుంటున్నారు. ఒకవేళ సినిమా రిజల్ట్ తేడా వస్తే పరిస్థితి ఏంటి అనేది ఆలోచించరా? అంటూ కొంత మంది నిర్మాతలలో మందుకు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ కథ, కథనం, దర్శకత్వం అన్నీ పవన్ కళ్యాణే. మరి గతంలో వపన్ కళ్యాణ్ కథతో వచ్చిన సినిమాలు ప్లాప్ లుగా నిలిచాయి. అలాంటింది ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ ప్రింట్ రెడీ అయిన తరువాత ఆ మూవీని చూసిన బిజినెస్ చేస్తే బెటర్ అని కొన్ని ఏరియాలకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ అంటున్నారంట. ప్రింట్ చూడకుండా కొని తరువాత మునిగిపోతే హీరోగారు, నిర్మాతగారూ ఎవ్వరూ తరువాత ఆదుకునేందుకు ముందుకురారు అనేది వారి వాదన అంట.

No comments:

Post a Comment