Sunday 3 January 2016

మహేష్ ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్

845045014021021

టాలీవుడ్ కి చెందిన టాప్ హీరోలు మధ్య మళ్ళీ పోటీ వాతావారణం నెలకొందని అంటున్నారు. 2016వ సంవత్సరంలో ఈ పోటీ జరగనుందని అంటున్నారు. ‘పవన్ కళ్యాణ్, మహేష్ బాబు’ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నటాప్ హీరోలు. చిరంజీవి రీ ఎంట్రి ఇచ్చినంత మాత్రానా, ప్రస్తుతం వీరిద్దరి మార్కెట్ ని టచ్ చేయాలంటే చిరుకి కొద్దిగా కష్టమే అని అంటున్నారు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాన్, మహేష్ బాబులు ఇద్దరూ మంచి స్నేహితులు అయినప్పటికీ…సినిమా పరంగా ఇద్దరి మధ్య గట్టిపోటీనే ఉంటుంది. గతంలో వీరిద్దరి సినిమాలు కొద్ది రోజుల గ్యాప్ లో రిలీజ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ఇద్దరి మూవీలు థియోటర్స్ వద్ద గట్టిగానే ఫైట్ చేసుకున్నాయి. ఒకరి థియోటర్స్ ని మరొకరు లాక్కోవటం వంటి పనులు సైతం గతంలో చేశారు. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ దర్సకత్వంలో వస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీ ఇండస్ట్రీ రికార్డ్స్ ని తిరగరాయాలనుకుంటుంది. ముఖ్యంగా టాప్ హీరో మహేష్ రికార్డ్స్ ని బ్రేక్ చేయాలనుకుంటుంది. శ్రీకాంత్ అద్దాల దర్శకత్వంలో వస్తున్న మహేష్ బ్రహ్మోత్సవం ఏప్రిల్ నెలలో రిలీజ్ అవుతుంది. ఇక ఈ మూవీ తరువాత వెంటనే సర్ధార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కాబోతుంది. అందుకే మహేష్ మూవీ రికార్డ్స్ ని బ్రేక్ చేసేందుకు పవన్ కళ్యాణ్ తన సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీని రిలీజ్ కోసం అన్ని విధాలుగా ప్లాన్ చేస్తున్నాడు. బ్రహ్మోత్సవం మూవీని టార్గెట్ చేయాలనే విషయాన్ని, డైరెక్టర్ బాబీతో పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పడంతో ఇది చర్ఛనీయాంశంగా మారింది.
please share it..

No comments:

Post a Comment