Saturday 2 January 2016

ఒక ఫోన్‌.. రెండు వాట్స‌ప్‌లు

08470402140

ఇప్పుడంతా డ్యూయ‌ల్ సిమ్ ఫోన్లు వాడుతున్నారు. దీంతో రెండు వాట్స‌ప్‌లు ఉంటే బాగుండు అని నిట్టూరుస్తున్నారు. ఐతే.. వీరి ఆశ‌లు తీరే త‌రుణం వ‌చ్చింది. ఇలాంటి వారి కోస‌మే.. ఇప్పుడు కొత్త గా యాప్‌లు పుట్టుకొచ్చాయి. వీటిని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫోన్‌లో రెండు వాట్స‌ప్‌లు రెడీ! ఓబీ వాట్స‌ప్‌, జీబీ వాట్స‌ప్‌, వాట్సాఎం యాప్ అనే థ‌ర్డ్ పార్టీ యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే రెండో వాట్స‌ప్ కూడా ఫోన్‌లో సిద్ధ‌మౌతుంది. ఇందుకు ముందు మ‌నం వాడుతున్న వాట్స‌ప్ యాప్‌ని ఆన్ ఇన్‌స్టాల్ చేయాలి. ఆ త‌ర్వాత ఈ థ‌ర్డ్ పార్టీ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత మ‌ళ్లీ మ‌న వాట్స‌ప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ రెండో వాట్స‌ప్‌లో కూడా మ‌న ప్రొఫైల్ పిక్చ‌ర్‌, స్టేట‌స్‌ను అప్‌డేట్ చేసుకోవ‌చ్చు. దీంతో ఒకే ఫోన్‌లో రెండు వాట్స‌ప్‌లు రెడీ అవుతాయి.
ఒకే ఒర‌లో రెండు క‌త్తులు ఇమ‌డవేమో గానీ ఒక ఫోన్‌లో రెండు వాట్స‌ప్‌లు చూసిన‌వాళ్లు హ్యాండ్స‌ప్ అనాల్సిందేనంటున్నారు వినియోగ‌దారు లు. రెండు వాట్స‌ప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఆనందంతో చిందులు వేస్తున్నారు. ఒకే ఫోన్‌లో రెండు వాట్స‌ప్‌లు రెడీ అవ‌డంతో జ‌నం యాప్ యాప్ హుర్రే అంటున్నారు. వావ్ వాట్స‌ప్ .. వాట్ ఏన్ ఐడియా అని ఎగిరి గంతేస్తున్నారు.
please share it..

No comments:

Post a Comment