Saturday, 2 January 2016

పవన్ పై పంచ్ లు వేసిన రోజా

pawan-kalyan-roja-01204

జ‌న‌సేనానిపై రోజా విరుచుకుపడింది. భూసేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా సీఆర్‌డీఏ కార్యాల‌యం (విజ‌య‌వాడ‌) ఎదురుగా.. వైఎస్సార్ సీపీ ధ‌ర్నా చేప‌ట్టిన సంగ‌తి విధిత‌మే! ఈ సంద‌ర్భంగా రోజా ప‌వ‌ర్‌స్టార్‌ను టార్గెట్‌గా చేసుకుని పంచ్ లు విసిరింది. భూసేకరణపై అంతెత్తున ఎగిరిపడ్డ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగార్జున యూనివర్సిటీలో చోటుచేసుకున్న రిషితేశ్వరి ఆత్మహత్యపై ఎందుకు మాట్లాడడం లేదని ప్ర‌శ్నించారు. అంతేకాదు త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ పోరాట ప‌ఠిమ‌వ‌ల్లే బాబు దిగివ‌చ్చి, ఆర్టీసీ, మున్సిప‌ల్ కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించార‌న్నారు.రోజా వ్యాఖ్య‌ల తీరు ఎలా ఉన్నా జ‌గ‌న్ వ‌ల్లే స‌ర్కార్ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ముందుకువచ్చింద‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దం.కార్మికులెవ‌రైనా ప్ర‌భుత్వంలో భాగ‌మే.ఓ కుటుంబం సంక్షోభంలో ఉంటే ఒడ్డుకు చేర్చేది ఆ..ఇంటి య‌జ‌మానే కానీ.. పక్కింటోడో.. ఎదురింటోడో కాదుగా.. పాపం! ఆమె గారికి ఇవేవీ తెలియ‌వు. ఆ.. మాట‌కొస్తే వైఫాఫ్ సెల్వ‌మ‌ణికి వైఫై యూజ్ చేయ‌డం త‌ప్ప‌! ఏమీ చేత‌కాదు. జ‌గ‌న్ భ‌జ‌న త‌ప్ప‌! శాస‌న‌స‌భ‌లోనూ / న‌గ‌రి నియోజ‌వ‌ర్గంలోనూ ఆమె చేసిందేమీ లేదు. మీడియాలో హ‌డావిడి కోస‌మో.. అధినాయ‌క‌త్వం మెప్పు కోస‌మో.. మాట్లాడుతున్నారు స‌రే! రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఉదంతంలో మీరు ఎన్‌యూకు వెళ్లి నిర‌స‌న పేరిట గంద‌ర‌గోళం సృష్టించ‌డం ఎందుకు? వీలుంటే బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి, కుదిరితే సాయం చేయొచ్చుగా.. ! అవేవీ కుద‌ర‌వు అనుకుంటే ఉందిగా బూతుల షో జ‌బ‌ర్ద‌స్త్ అక్క‌డికి వెళ్లి మ‌స్త్‌..మ‌స్త్‌గా లోకాభిరామాయ‌ణం చెప్పుకోండి.మిమ్మ‌ల్ని ఎవ్వ‌రూ ఏమీ అన‌రు.క‌నీసం ప‌ల్లెత్తు మాట కూడా అన‌రు.
please share it..

No comments:

Post a Comment