Saturday 2 January 2016

రానా ల‌వ‌ర్ స‌మంత‌?

samantha-0120120

భ‌ళ్లాల దేవుడు రానా త‌న ట్విట‌ర్ ఖాతాలో ఓ స్టిల్ పోస్ట్ చేసి… తన పక్కన ఉన్నది ఎవరో కనుక్కోమని ఓ పజిల్ విసిరి, నెటిజ‌నుల‌కు పెద్ద చిక్కే తెచ్చాడు.అప్పట్నుంచి రానా పక్కన ఉన్న అమ్మాయి త్రిష అని కొంతమంది గెస్ చేశారు. ఇంకొంతమంది ‘బెంగుళూరు డేస్’ రీమేక్ లో సటిస్తున్న శ్రీదివ్య అని, నజియా నజ్రీమ్ అని గెస్ చేశారు. కానీ వీరెవ్వరూ కాదు. ఆమె రానా లవర్. రానా లవర్ అంటే నిజ జీవితంలో రానా ప్రేమికురాలు అనుకునేరు. ‘బెంగుళూరు డేస్’ చిత్రంలో రానా లవర్. ఈ సినిమాలో రానా లవర్ గా నటిస్తున్నది ఎవరో కాదు. చుల్‌బులి సమంత. హ‌మ్మ‌య్యా! బ‌హుశా! రానా ప‌క్క‌న ఉన్న‌ది బిపాసానో .. మొపాసానో అనుకోలేదు క‌దా! ర‌క్షించావ్రా దేవుడా..!
అబౌట్ ఫిల్మ్ : రానా ” డేస్ ” బాగున్నాయ్
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘బెంగుళూరు డేస్’ చిత్రం తెలుగు, తమిళ్ రీమేక్ హక్కులను ప్ర‌ముఖ కార్పొరేట్ దిగ్గ‌జం ” పీవీపీ ”
సొంతం చేసుకుంది.మల‌యళ వెర్షన్ లో దుల్హార్ సల్మాన్, పాహద్ ఫాజిల్, నివిన్ పౌలీ, నజ్రియా నజీమ్, ఇషా తల్వార్ నటించగా నిత్యామీనన్ కీలక పాత్ర పోషించింది.తెలుగు వెర్షన్ షూటింగ్ ఇంకా..ప్రారంభమవ్వలేదుగానీ, తమిళ్ వెర్షన్ షూటింగ్ మాత్రం శ‌ర‌వేగంగా జరుగుతోంది. ఆర్య, రానా, బాబి సింహ హీరోలుగా తమిళ్ వెర్షన్ తెరకెక్కుతోంది.దుల్హార్ సల్మాన్ పాత్రను ఆర్య, పాహద్ ఫాజిల్ పాత్రను రానా, నివిన్ పౌలీ పాత్రను బాబి సింహ చేస్తున్నారు.నజ్రియా నజీమ్ పాత్రను ” మ‌న‌సారా ” ఫేం శ్రీదివ్య చేస్తోంది. ఇషా తల్వార్ పాత్ర కోసం లక్ష్మీరాయ్ ని తీసుకున్నారు. మలయాళ వెర్షన్ లో కీలక పాత్ర పోషించిన నిత్యామీనన్ పాత్ర కోసం సమంతను తీసుకున్నారు. రానా లవర్ గా ఓ ఎపిసోడ్ లో కనిపించి, త‌ళుకులీన‌నుంది సమంత.ఈ సినిమాలో స‌మ్మూ గెస్ట్ ఎపీరియ‌న్స్ మాత్ర‌మే ఇవ్వ‌నుంది.ఇటీవలే రానా, సమంత పై కొన్ని సీన్లు షూట్ చేశారు. అప్పుడు తీసిందే ఈ చిత్రం.సో.. గా..సిప్పు రాయుళ్లూ.. వేడివేడి కాఫీ సిప్పు చేసి మ‌రీ! ఊపిరి పీల్చుకోండి నాయ‌నా! నిజమేంటో తెలిసిందిగా.. హాయిగా వీకెండ్ ను ఎంజాయ్ చేయండి నాయ‌నా! ఈ రాత్రి కంటి నిండా కునుకు తీయండి నాయనా! అంటిల్ నో సెకండ్ థాట్స్‌. నో.. కాంట్ర‌వ‌ర్సీస్‌. హ్యావ్ ఏ హ్యాపీ వీకెండ్‌. దిస్ ఈజ్ డెక్క‌న్ రిపోర్ట్‌. సైనింగ్ ఆఫ్ టు యు.
please share it..

No comments:

Post a Comment