Saturday 2 January 2016

పవర్ స్టార్ అంటే అదే మరి…మరో సారి తన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడుగా!!

pawan kalyan gives chance to johny master for direction
ఎవరికైనా మాటిస్తే వెనుకడుగు వేసేది లేదు. వాళ్ళ సక్సెస్ హిస్టరీలు చూడడు. ఆయన సహాయం ఒకరికి ఉపయోగకరంగా ఉందంటే చాలు. సహాయం చేయడానికి ముందుకొచ్చేస్తాడు. ఇలాంటి గుణాలు చిత్ర పరిశ్రమలో ఎవరికి మెండుగా ఉన్నాయంటే…టక్కున పవన్ కళ్యాణ్ పేరు చెబుతారు. ఆయన ఏ రంగంలో అడుగుపెట్టినా సంచలనమే…అది సినిమా అయినా..రాజకీయం అయినా.
ఇక తాజాగా…ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఓ కొరియోగ్రాఫర్ కి తన సినిమాకి దర్శకత్వం వహించడానికి ఎప్పుడైనా అవకాసం ఇస్తానని మాట ఇచ్చిన నేపధ్యంలో….ఆ అవకాసం ఇప్పుడు పిలిచి మరీ ఇచ్చారట పవన్.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు కు డైరెక్టర్ అవ్వాలనే ఆశ ఉండటం…అదీ పవర్ స్టార్ తో సినిమా తీయాలనే ఆశక్తి ఉండడంతో తన కోరికను కొన్ని సంవత్సరాల క్రితం పవర్ కు వెలుబుచ్చగా…ఇచ్చిన మాట ప్రకారం పవన్ ఓకే చెప్పారట.
త్వరలో దర్శకరత్న దాసరి నారాయణ రావు నిర్మించే ప్రాజెక్టులో జానీ మాస్టర్‌ను రికమండ్ చేశారట పవన్. ఇక ప్రస్తుతం చిత్రపరిశ్రమలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించే చర్చ. ఇచ్చిన మాట కోసం…ఓ కొరియోగ్రాఫర్ కి డైరెక్షన్ చాన్స్ ఇవ్వడం..అంటే అది పవన్ క్యారక్టర్ లో భాగమే అని…దానిలో వింతా ఏమి లేదని అనుకుంటున్నారు సినీ జనాలు.
please share it..

No comments:

Post a Comment