Sunday, 3 January 2016

మెగా ఫ్యామిలీకి బ‌న్నీ షాక్‌

4040041400401


కొద్ది రోజులుగా మీడియాలో కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు మెగాస్టార్ చిరంజీవి, ఆయ‌న బావ‌మ‌రిది అల్లు అర‌వింద్‌ది ఒక‌టే మాట‌..ఒక‌టే బాట‌. అయితే తాజా వార్తల నేప‌థ్యం ఏంటంటే అల్లు అర‌వింద్ భవిష్య‌త్తులో త‌న కొడుకు బ‌న్నీని స్టార్‌ను చేసేందుకు చెర్రీ కేరీర్ కంటే బ‌న్నీ కేరీర్‌పైనే బాగా శ్ర‌ద్ధ పెడుతున్నాడ‌న్న మ్యాట‌ర్. ఈ వార్త‌ల‌పై ఎవ్వ‌రూ స్పందిచ‌లేదు. అయితే తాజాగా జ‌రిగిన ఓ ప‌రిణామం చూస్తుంటే మెగా ఫ్యామిలీ నుంచి బ‌న్నీ వేరు కుంప‌టి పెట్టుకుంటున్నాడా…మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కాకుండా బ‌న్నీ త‌న‌కంటూ సొంతంగా ఓ అభిమాన గ‌ణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.
టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీ హీరోలంటే మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌, మెగా సుప్రీమ్ వ‌రుణ్‌తేజ్‌, సాయిధ‌ర‌మ్ తేజ్, అల్లు శిరిష్ వీళ్లంతా వ‌స్తారు. మెగా ఫ్యామిలీ అండ‌దండ‌ల‌తోనే బ‌న్నీ టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒక‌డిగా ఎదిగాడు. అయితే ఇప్పుడు బ‌న్నీ మెగా కాంపౌండ్‌కు పెద్ద షాక్ ఇచ్చేలా క‌నిపిస్తున్నాడు. రీసెంట్‌గా అఖిల భార‌త అల్లు సంఘం పేరిట ఓ ఫ్యాన్స్ క్ల‌బ్ ఏర్ప‌డింది. అల్లు బ్ర‌ద‌ర్స్ అయిన స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్‌(బ‌న్ని), శిరీష్ మెగా కాంపౌండ్ నుంచి వేరు కుంప‌టి పెట్టుకున్నార‌నేందుకు ఇది బీజం వేసింద‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
చిరు త‌న‌యుడు రాంచ‌ర‌ణ్‌కు చిరంజీవి నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన ఫ్యాన్స్ అండ‌దండ‌లు ఉన్నాయి. బ‌న్నీకి కొంత వ‌ర‌కు మెగా ఫ్యాన్స్ స‌పోర్ట్ ఉన్నా త‌న స్టైలీష్ యాక్టింగ్‌, డ్యాన్సుల‌తో చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను మెప్పించి సొంతంగా త‌న కంటూ ఫ్యాన్స్‌ను ఏర్ప‌రుచుకున్నాడు. బ‌న్నీ న‌టించిన చివ‌రి మూడు సినిమాలు రూ.50 కోట్ల షేర్ రాబ‌ట్టాయి. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కాకుండా త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ కోసం ట్రై చేస్తోన్న బ‌న్నీ భ‌విష్య‌త్తులో కూడా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన అభిమాన సంఘం ఉండాల‌ని బ‌న్నీ భావించాడ‌ని, అందుకే అఖిల భార‌త అల్లు సంఘంకి అంకురార్ప‌ణ జ‌రిగింద‌న్న టాక్స్ వినిపిస్తున్నాయి. అంటే ఇక నుంచి బ‌న్నీ వేడుక‌ల‌కు వీళ్ల‌కే ఆహ్వానాలు అందుతాయ‌న్న‌మాట‌. మ‌రి ఈ వేరుకుంప‌టి మెగా – అల్లు ఫ్యాన్స్ మ‌ధ్య చిచ్చు రేపుతుందా? లేదంటే ఇది వ‌ర‌క‌టిలా క‌ల‌సిమెల‌సి ఉంటారా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాలి
please share it..

No comments:

Post a Comment