Monday, 4 January 2016

పవన్ కి 6లక్షలు…మహేష్ కి 15లక్షలు

pawan-maheah-rgv-222

రామ్‌గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ. వివాదాల‌కు నెల‌వు ఆ పేరు.. సంచ‌ల‌నాల‌కు మారు పేరు ఆ.. పేరు. ఎప్పుడూ మీడియా హెడ్‌లైన్ షో లో హ‌ల్‌చ‌ల్ చేసే వ‌ర్మ తాజాగా మ‌రో వివాదాన్ని నెత్తికెత్తుకున్నాడు. తాజాగా పవన్‌,మహేష్‌ ఫ్యాన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసి, ఆయా అభిమానుల ఆగ్ర‌హాన్ని చ‌విచూస్తున్నాడు. పవన్ ట్విట్టర్‌ అకౌంట్‌కి కేవలం 6 లక్షల ఫాలోవర్స్‌ మాత్రమే ఉన్నార‌ని, మహేష్‌కి 15 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నార‌ని, ఓ పవ‌న్ అభిమానిగా ఇది త‌న‌నెంతో ఆశ్చ‌ర్య‌ప‌రిచింద‌ని పేర్కొంటూనే త‌న‌దైన శైలిలో సెటైర్ల‌ను కాయిన్ చేశాడు.పవర్‌స్టార్‌ ఫ్యాన్స్ లో ఎక్కువ మంది టెక్నాల‌జీని అందిపుచ్చుకోవ‌డంలో వీక్ అని తేల్చేశాడు. మ‌హేశ్ ఫ్యాన్స్ ఇందుకు భిన్నమని చెప్పాడు. పవన్‌ ఫ్యాన్స్‌తో పోలిస్తే మహేష్‌ ఫ్యాన్స్‌ ఎడ్యుకేటెడ్‌ అని చెప్పి నయా త‌గాదాకు తెర‌లేపాడు. దీంతో వ‌ర్మ కామెంట్స్‌పై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.ఆయ‌న‌దంతా పిచ్చివాగుడ‌ని కొట్టిపారేస్తూనే.. ఇటువంటి బాధ్య‌తారాహిత్య వ్యాఖ్య‌ల‌ను తామేం ప‌ట్టించుకోబోమ‌ని చెబుతున్నారు.వ‌ర్మ‌కు స‌రైన స‌మ‌యంలో..స‌రైన రీతిలో బుద్ధి చెబుతామ‌ని అంటున్నారు.ఖ‌బ‌డ్దార్ వ‌ర్మ అని హెచ్చ‌రిస్తున్నారు.
please share it..

No comments:

Post a Comment