Saturday 2 January 2016

కోడి ధ‌ర కొండ దిగింది

chicken_.012010

పౌల్ట్రీ ప‌రిశ్ర‌మ‌కు కొత్త క‌ష్టాలు వ‌చ్చిప‌డ్డాయ్‌.సరఫరా అమాంతం పెరిగి.. డిమాండ్ త‌గ్గ‌డంతో చికెన్‌తో పాటు గుడ్ల ధర కూడా.. పడిపోయింది. కిలో కంది పప్పు రూ.200 పలుకుతుండగా.. గత వారం హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర ఒక దశలో రూ.96 కు పడిపోయింది. ప్రస్తుతం కిలో రూ.110కి చేరినా, అది నిలబడుతుందో లేదోనని పరిశ్రమ వర్గాలు భయపడుతున్నాయి. రైతులకు లభించే ఫారమ్‌ గేటు ధర సైతం కిలో బ్రాయిలర్‌ కోడికి తెలుగు రాష్ట్రాల్లో రూ.60 మించడం లేదు. ఒక్క నెల్లూరు జోన్‌లో మాత్రమే ఆదివారం కిలో కోడికి రైతుకు రూ.60 లభించింది. గత వారం చిత్తూరు జిల్లాలో ఒక దశలో కిలో బ్రాయిలర్‌ కోడి ధర రూ.43కు పడిపోయింది. వైజాగ్‌ ప్రాంతంలో సైతం కిలోకు రూ.50కి మించి లభించడం లేదు. హైదరాబాద్‌ చుట్టుపక్కల సైతం ఇదే పరిస్థితి. దీంతో కిలో బ్రాయిలర్‌ కోడిపై రూ.25 వరకు న ష్టపోతున్నట్టు తెలంగాణ పౌల్ర్టీ బ్రీడర్స్‌ అసోసియేషన్‌’ అధ్యక్షుడు రంజిత్‌ రెడ్డి చెప్పారు.ఓవైపు చికెన్‌, గుడ్ల ధర పడిపోతుంటే.. మ‌రోవైపు దాణా ధర మాత్రం పెరిగిపోతోంది. గత ఏడాది కిలో రూ.28 ఉన్న సోయా ధర ఇపుడు రూ.38కి చేరింది. దాణా తయారీలో ఉపయోగించే మరో ప్రధాన ముడి పదార్ధం మొక్కజొన్న ధర సైతం క్వింటా రూ.1,500కు చేరింది. నూనె తీసిన చెక్క ధర సైతం టన్ను రూ.48,000 నుంచి రూ.50,000 పలుకుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
please share it..

No comments:

Post a Comment